అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సందిప్ రెడ్డివంగా కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టిస్తున్న సందీప్ వంగా.. తన మొదటి సినిమాతోనే యూత్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక తను తెరకెక్కించిన మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిన సందీప్.. ఈ సినిమా విషయంలో పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందనలతో యానిమల్ సినిమాను తెరకెక్కించి.. ఈ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఈ సినిమాకు సైతం ఎన్నో విమర్శలు తలెత్తగా.. వాటికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ.. అందరి నోళ్లు మూయించాడు.
ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా.. తాను తెరకెక్కించిన అన్ని సినిమాలానే.. చాలా పవర్ ఫుల్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు సందీప్. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇలాంటి క్రమంలో సందీప్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. గతంలో సందీప్.. షూట్ టైంలో ఓ నటుడిని తలపై కొట్టాడట. అయితే.. ప్రస్తుతం అతని ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్నాడని సమాచారం. ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు.. రాహుల్ రామకృష్ణ. ఎస్.. సందీప్ దర్శకుడిగా వ్యవహరించిన మొదటి సినిమా అర్జున్ రెడ్డిలో.. రాహుల్ రామకృష్ణ ఒక కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.
ఇక.. ఈ సినిమా షూట్ టైంలో హీరోయిన్‌కు.. మరొక వ్యక్తితో పెళ్లి అయ్యే సీన్ ఉంటుంది. ఆ టైంలో.. రాహుల్ ఆ పెళ్లి జరుగుతున్న ప్లేస్ కు వెళ్లి.. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ను విసుర్తాడు. అయితే.. ఈ ఎమోషనల్ సీన్స్ లో వచ్చే డైలాగ్‌లను రాహుల్ సందీప్ చెప్పినట్లు కాకుండా తనదైన స్టైల్ లో చెప్పాలని ప్రయత్నించాడట. ఈ క్రమంలోనే.. సందీప్ రాహుల్ తలపై కొట్టి సేమ్ నేను చెప్పినట్లే ఎమోషన్స్ చూపించు.. అప్పుడే సెట్ అవుతుంది అంటూ ఫైర్ అయ్యాడట. దీంతో.. రాహుల్, సందీప్ చెప్పినట్లే ఎమోషన్స్ పండించాడు. అయితే.. సందీప్ చేయి చేసుకున్న రాహుల్ మాత్రం దాన్ని చాలా స్పోర్టీవ్‌గా తీసుకుని చేశాడని సందీప్ వంగా చెప్పుకొచ్చాడట. తాను కూడా.. సీరియస్‌గా కొట్టలేదని.. అప్పటికే మా మధ్యన ఫ్రెండ్షిప్, క్లోజ్ బాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఆయనపై చేయి చేసుకున్నానంటూ వివరించినట్లు తెలుస్తోంది.



