బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఫైట్స్, టాస్కులు, కంటెస్టెంట్లు మధ్యన బాండింగ్.. ఆడియన్స్ లో మరింత ఆశక్తి క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ పరంగా గాని, టాస్కుల పరంగా గాని, తెలివిగా ఆలోచించడంలో కానీ విన్నర్ అవడానికి ఒక కంటెస్టెంట్ లో ఎలాంటి లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలను కలిగి ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఎవరు అంటే మాత్రం ఇమ్మానుయేల్ పేరే వినిపించింది. ఒక కమెడియన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్ముకు.. మొదటి నుంచి విన్నర్ లక్షణాలున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
![]()
గత కొద్ది రోజులుగా మాత్రం.. బాగా మాట్లాడుతు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వస్తున్నాడని.. చాలా కన్నింగ్ అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. టైటిల్ నుంచి రెండు అడుగులు వెనక్కి పడినట్లు కనిపిస్తుంది. అయితే.. ఓ గేమర్గా మాత్రం ఎప్పుడు 100% ఎఫర్ట్స్ ఇస్తూ వస్తున్న ఇమ్ము.. తాజాగా.. బిగ్‌బాస్ హౌస్‌లో ఓ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంతకీ ఇమాన్యుల్ క్రియేట్ చేసిన హిస్టరీ ఏదో కాదు.. ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్నా.. ఈ రికార్డును మాత్రం ఎవ్వరు దక్కించుకోలేకపోయారు.
![]()
మొదటిసారి కెప్టెన్ అయినప్పుడు ఇమ్ము.. అమ్మ అని పిలుచుకునే సంజన కోసం దాన్ని త్యాగం చేశాడు. రెండు వారాల తర్వాత టాస్కులు ఆడి కెప్టెన్సీని మళ్ళీ దక్కించుకున్నాడు. ఇక ఈ వారం కూడా మళ్లీ కెప్టెన్సీ టెస్ట్‌లో గట్టి పోటీ ఇచ్చి తానే కెప్టెన్సీ ని సొంతం చేసుకున్నాడని సమాచారం. తన గేమ్స్ స్టైల్, స్ట్రాటజీతో మొత్తం సీజన్ లోనే ఓ ఆల్ టైం రికార్డును నెలకొల్పాడు. వరుసగా తొమ్మిది వారాలు నామినేషన్స్‌లోకి రాని ఏకైక కంటెస్టెంట్‌గా ఇమ్ము నిలిచాడు. కానీ.. ఇది ఇమ్ముకి కాస్త నెగిటివ్ అయింది. విన్నర్ రేస్ నుంచి వెనకడుగు వేసేలా చేసింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇమ్ము నామినేషన్లోకి రాకముందే.. టాప్ 5లో ఉండేలా కనిపిస్తున్నాడు.

