సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలంటే టాలెంట్‌తో పాటు.. క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. స్టార్డం వచ్చేసింది కదా అని నచ్చినట్లు బిహేవ్ చేస్తే లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ వస్తుందని మేధావులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ జబర్దస్త్ కమెడియన్ చేసిన తప్పుకు పవన్ చేతిలో తన్నులు తిన్నాడట.. తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు కూడా కోల్పోయాడంటూ టాక్ వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ కామెడీయన్ ఎవరో కాదు.. షకలక శంకర్. జబర్దస్త్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న షకలక శంకర్ తర్వాత పలు సినిమాల్లో కామెడియన్గాను నటించాడు. ఇక పలు సినిమాలకు హీరోగాను మెరిసాడు. అయితే.. శంకర్ పవన్‌తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కాంబినేషన్ సీన్స్ అప్పుడు శంకర్ ఆలస్యంగా వచ్చేవాడట. దీంతో.. పవన్ ఒకసారి శంకర్‌ను పిలిచేందుకు లేట్ అవుతుందని అడిగితే.. కేర్లెస్గా సమాధానం చెప్పాడట.

దీంతో.. విపరీతంగా కోపం వచ్చేసిన పవన్ అతనిని చంపపై లాగి కొట్టడని టాక్ పవన్ కళ్యాణ్ మనసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసింది ఎవరైనా.. ముఖంపై దానిని ఖండించే వ్యక్తిత్వం.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి షకలక శంకర్‌పై ఫైర్ అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తానికి లీకై.. కమెడియన్ అవకాశాలు తగ్గుతూ వచ్చాయట. తర్వాత పలు సినిమాలు హీరోగా చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటున్నాడు.

