మీనాక్షి స్పీడ్ కు నో బైక్స్.. లైనప్ చూస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరికి ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. 2017లో మిస్ ఐఎంఏ పోటీల్లో పాల్గొని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతుంది. సుశాంత్ హీరోగా తెర‌కెక్కిన ఇచట వాహనంలో నిలపరాదు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత కొంతకాలానికి రవితేజ సరసన కిలాడి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు.

దీంతో.. అడపాదడప సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. హిట్ 2 సినిమాతో.. భారీ సక్సెస్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తర్వాత.. దుల్క‌ర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో హిట్ అందుకుంది, ఇందులో హౌస్ వైఫ్ గా మెరిసిన‌ మీనాక్షి.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మిన్ను పాత్రలో మెరిసి నవ్వులు పూయించింది.

ఈ సినిమాతో.. వెంకటేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాస్ కొల్లగొట్టిన రికార్డ్ సొంతం చేసుకున్నారు. కాగా.. ఈ సినిమా తర్వాత మీనూ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. కేవలం సినిమాల పరంగానే కాదు.. సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ.. గ్లామర్ మెరుపులతో కుర్రకారును కవ్విస్తుంది. ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాతో పాటు.. ఈ అమ్మడి ఖాతాలో మరో అరడజన్ సినిమాలు ఉన్నట్లు సమాచారం.