అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆ క్రేజీ డైరెక్టర్ తో రవితేజ మూవీ ఫిక్స్.. ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టినట్టే..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మాస్ మహారాజ్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు రవితేజ. ఎనర్జీ, యాక్షన్, కామెడీ ఇలా జానర్ ఏదైనా సరే తనదైన స్క్రీన్ ప్రజెన్స్‌తో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న రవితేజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా.. ఇటీవల కాలంలో.. ఆయన సినిమాలు ఊహించిన రేంజ్ లో రిజ‌ల్ట్‌ను అందుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా మాస్‌ సినిమాలు వదిలి.. ఫ్యామిలీ అస్త్ర ప్ర‌మోగించేందుకు సిద్ధ‌మయ్యాడంటూ టాక్ వైరల్ గా మారింది.

మాస్ మహారాజాతో 'బింబిసార' దర్శకుడు? | Ravi Teja holding talks with director  vasishta mallidi

ఇలాంటి క్రమంలో.. ఆయనకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ నెటింట ట్రెండ్ అవుతుంది. త్వరలోనే.. రవితేజ భారీ ఫాంటసీ డ్రామాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అది కూడా.. మెగాస్టార్ డైరెక్టర్ వశిష్టతో కావడం ఇప్పుడు ఆడియన్స్ లో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే మెగాస్టార్ చిరుత భారీ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర ని రూపొందిస్తున్నాడు వ‌శిష్ఠ‌.. ఈ సినిమా ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటుంది. గతంలో బింబిసారా మూవీ సక్సెస్ తో తనకంటూ డైరెక్టర్గా ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వశిష్ట.. ఇప్పుడు మెగాస్టార్ లాంటి లెజెండ్రి హీరోతో సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభరను రూపొందించి.. మరోసారి తన టాలెంట్ ప్రూవ్‌ చేసుకోవాలి అనుకున్నాడు.

Happy Birthday Ravi Teja: 5 Best Movies of the South Indian Actor That You  Should Not Miss | Movies News - News18

ఈ సినిమాపై.. ఇప్పటికే సినీ ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రమంలో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కూడా ప్రిపరేషన్ మొదలెట్టేసిన వశిష్ట.. ఆ ప్రాజెక్టు కోసం హీరోగా మాస్ మహారాజ్ రవితేజను కూడా ఫిక్స్ చేసాడట. ఇప్పటికే రవితేజకు సైతం స్టోరీ లైన్ వినిపించాడని.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబినేషన్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు మొదలయ్యాయి. మైండ్ బ్లోయింగ్ సోషియా ఫాంటసీ డ్రామాను వ‌శిష్ఠ‌ సిద్ధం చేశాడట. కాగా.. రవితేజ బాగా ఇంప్రెస్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక.. సినిమాలో మాస్, యాక్షన్, ఎమోషన్స్, హ్యూమర్, కామెడీ అన్ని ఈక్వల్ గా మిక్స్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ టచ్ ఇస్తూ తెరకెక్కించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాతో అయినా రవితేజ కెరీర్ లో కొత్త పేజ్ తెరుచుకుంటుందో.. లేదో.. బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుని మళ్లీ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ ఇస్తాడేమో వేచి చూడాలి.