ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష ఎంగేజ్మెంట్ తాజాగా గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు.. చరణ్, ఉపాసన.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పాల్గొని సందడి చేశారు. ఇక.. ఈ ఈవెంట్ తర్వాత.. శిరీష్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తాను.. నైనికను కలిసి రెండేళ్ల అవుతుందంటూ కాబోయే భార్య గురించి.. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి రివీల్ చేశాడు. హీరో నితిన్, ఆయన భార్య షాలినితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. తన ప్రేమ కథను పంచుకున్నాడు.

2023లో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి చేసుకోగా.. నితిన్, షాలిని వాళ్ళ పెళ్లికి స్పెషల్ పార్టీని హోస్ట్ చేశారు. ఈ పార్టీకి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నైనిక కూడా హాజరైందని శిరీష్ తన పోస్ట్ లో షేర్ చేసుకున్నాడు. అలా మొదలైన మా పరిచయం.. 2 ఏళ్ల తర్వాత.. హ్యాపీగా నిశ్చితార్థం చేసుకునే వరకు వచ్చిందని రాసుకోచ్చాడు. భవిష్యత్తులో మా పిల్లలకు మా ప్రేమ కథ గురించి అడిగితే ఇదే చెప్తానని వివరించాడు.
![]()
అంతేకాదు.. నైనిక ఫ్రెండ్స్ కు కూడా స్పెషల్ విషెస్ తెలియజేశాడు. మరోవైపు నితిన్ భార్య షాలిని సైతం.. శిరీష్, నైనిక ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇన్స్టా వేదికగా పంచుకుంటూ.. మీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లో నేను ఓ భాగమైనందుకు హ్యాపీగా ఉందంటూ షేర్ చేసుకుంది. శిరీష్ రిప్లై ఇస్తూ.. థాంక్స్ పెళ్లి పెద్ద అంటూ కామెంట్ చేసాడు. దీంతో ప్రజెంట్ అల్లు శిరీష్ లవ్ స్టోరీ నెటింట తెగ వైరల్ గా మారుతుంది.

