తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రజెంట్ 9వ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ మొదలై 8 వారాలు కంప్లీట్ అయింది. 8వ వారం దువ్వాడ మాధురి హౌస్ నుంచి ఎల్మినేట్ కాగా.. 9వ వారం నామినేషన్స్ ఆడియన్స్‌కు మరింత రసవత్తరంగా మారాయి. కాంటెస్టెంట్ల మధ్యన గొడవలకు మరింత ఆజ్యం పోసినట్లు బిగ్ బాస్ టాస్క్‌ను పెట్టాడు. మొత్తానికి నామినేషన్స్, గొడవలు, ఎమోషన్స్‌తో కంప్లీట్ అయ్యాయి. కాగా.. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళబోతున్నారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
కాగా.. ప్రజెంట్ ఓటింగ్ ప్రకారం తనుజ టాప్‌లో దూసుకు వెళ్తుంది. విన్నర్ అయ్యే అవకాశం ఈమెకు ఎక్కువగా ఉన్నాయంటూ.. ఇండస్ట్రీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడికి ఉన్న క్రేజ్‌తో హౌస్ నుంచి రాకముందే ఓ సినిమాలో జాక్‌పాట్ ఆఫర్ కొట్టేసిందంటూ టాక్ ప్రజెంట్ వైరల్ గా మారుతుంది. అది కూడా.. స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసిందట. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ సినిమా ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం.
సెప్టెంబర్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి.. ప్రతి ఒక్క టాస్క్ లోను యాక్టివ్‌గా ఉంటూ అందరితో చక్కగా మాట్లాడుతూ ఆడియన్స్‌ను ఫిదా చేసిన ఈ అమ్మడు.. చీటికిమాటికి ఎమోషనల్ అవుతూ.. కొన్ని నెగటివ్ కామెంట్స్ అయితే ఎదుర్కొంటుంది. ఇలాంటి క్రమంలో.. ఆమె ఎక్కడ ఎలిమినేట్ కాకుండా అభిమానులు స్ట్రాంగ్ గా ఓటింగ్ ఇస్తూ.. కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక ఈ షో తర్వాత.. అమ్మడు ఓ స్టార్ హీరో సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, బాబి డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాలో చిరంజీవి మరదలు రోల్లో తనుజ ఛాన్స్ అందుకుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.

