టాలీవుడ్ స్టార్ నటుడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఎన్నో సినిమాల్లో నటించే ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరో పక్క.. రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో ఓజీలో నటించి హిట్ అందుకున్న ప్రకాష్ రాజ్.. ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా.. కేరళ స్టేట్ ఫిలిం అవార్డుల జ్యూరీ చైర్మన్ గా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
జాతీయ చలనచిత్ర అవార్డులు రాజీపడుతున్నాయి అంటూ.. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది నేను చెప్పడానికి అసలు భయపడను. కేరళ అవార్డుల జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే.. వాళ్లు నన్ను పిలిచేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక బయట వ్యక్తి అవసరమని.. మేము ఈ ప్రక్రియలో అస్సలు తలదూర్చబోమంటూ.. నిర్ణయాధికారం పూర్తిగా మీకే ఉంటుందంటూ వివరించారు. కానీ.. నేషనల్ అవార్డ్స్ విషయంలో మాత్రం ఇది జరగనే లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. కొందరికి మాత్రమే అవార్డులు దక్కుతున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇక.. ఈ జాబితాలో మంజుమల్ బాయ్స్, బ్రహ్మయుగం లాంటి మూవీస్‌కు అవార్డులు ఇచ్చరు. అలాంటి జ్యూరీ.. అలాంటి నేషనల్ గవర్నమెంట్ విధానాలు ఉన్నప్పుడు.. గొప్ప వ్యక్తులు మమ్ముక్క (మమ్ముట్టిని ముద్దుగా పిలుచుకునే పేరు) లాంటి వాళ్లకు ఆ అవార్డులు అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. వినయంతో సినిమా వాళ్లు.. పిల్లల మూవీస్ తీయడం గురించి ఆలోచన చేయాలని మేము కోరుకుంటున్నాం. దర్శకులు, రచయితలకు.. ఇది కేవలం పెద్దలు, యువకులు మాత్రమే కాదు పిల్లలు కూడా ఉండే సమాజంలో. వాళ్లు కూడా భాగం అంటూ గ్రహించాలని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.


