పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ అంతా.. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్ కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా రోజులవుతున్నా.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క చిన్న అప్డేట్ కూడా రివీల్ చేయకుండా రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నాడు. దీంతో.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా బాగుండని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే.. త్వరలోనే ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమాపై టీం ఓ బ్లాస్టింగ్ అప్డేట్ రివీల్ చేయనున్నారట. నవంబర్లో మహేష్ బాబు సినిమాకు సంబంధించిన టైటిల్ రివిల్ చేస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఈ విషయంపై మూవీ టీం అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. చాలా గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించనున్నట్లు వివరిస్తూనే.. ఈవెంట్ కు సంబంధించిన టైం ,ప్లేస్ ను కూడా అనౌన్స్ చేశారు. మహేష్ – రాజమౌళి కాంబోలో ఈ సినిమాను ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో షూట్ జరుపుతున్నారు. అయితే.. ఇప్పటివరకు సినీ హిస్టరీ లోనే లేని రేంజ్ లో.. సరికొత్త స్టైల్ లో సినిమా అప్డేట్ స్ట్రీమ్ చేయనున్నారట మేకర్స్. నవంబర్ 15న సాయంత్రం 6 గంటలకు సినిమా వేడుకను హైదరాబాద్.. రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్గా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇక.. ఈవెంట్ కి ఎలాంటి హాలీవుడ్ సెలబ్రిటీస్ స్పెషల్ గెస్ట్ గా రావడం లేదట. ఇక.. ఈ ఈవెంట్‌లో మూవీ టీం మాత్రమే పాల్గొననున్నారట.
అయితే.. ఈ టైటిల్, గ్లింప్స్ అందరూ వీక్షించేలా.. సినిమాను ప్రమోట్ చేయడం కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈవెంట్ మొత్తాన్ని.. అలాగే సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు గ్లింప్స్ వీడియో ప్రసార హక్కులను కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్ స్టార్‌కు అమ్మినట్లు సమాచారం. జియో హాట్ స్టార్ లో ఈవెంట్ ప్రసారమవుతుందని అఫీషియల్ గా టీం వెల్లడించారు. అయితే.. ఇప్పటివరకు సినిమా టైటిల్, గ్లింప్స్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయాల్సిన అవసరం రాలేదు. కానీ.. సినీ చరిత్రలోనే మొదటిసారి.. రాజమౌళి, మహేష్ సినిమా విషయంలో ఇది జరిగింది. ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే ఆడియన్స్లో భారీ లెవెల్లో అంచనాలను నెలకొన్నాయి. గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో రాజమౌళి తన టార్గెట్ ను రీచ్ అవుతాడా.. లేదా.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

