టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా.. ఓ సోలో సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం సంక్రాంతి బరిలో నా సామరంగ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు నాగ్. తన 99వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. తన కెరీర్ లోనే మైల్డ్ స్టోన్‌గా మారనున్న.. కింగ్ 100 కోసం నాగ్ చాలా భారీగానే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఆ రేంజ్ కంటెంట్ కోసం ఇంతకాలం గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ గ్యాప్‌లోనే.. కుబేర, కూలి లాంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి.. అక్కడ కూడా తన సత్తా చాటుకున్నాడు నాగార్జున. ఈ క్రమంలోనే.. ఎంతమంది దర్శకుల కథలను విన్న, నాగార్జున ఎట్టకేలకు తమిళ్ డైరెక్టర్ కార్తీక్ ను తన 100వ సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక.. ఈ సినిమా ఓ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొంది. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది.

ఈ సినిమా కోసం.. నాగార్జున సరసన.. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేయనున్నారట. వాళ్లలో మొదట.. సీనియర్ హీరోయిన్ టబు పేరు వినిపిస్తుండగా.. మరో హీరోయిన్‌గా సుస్మిత భట్‌ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక.. మూడవ హీరోయిన్‌గా ఓ పాపులర్ బ్యూటీని తీసుకోవడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. అయితే.. ఇప్పటికే ఈ సినిమా షూట్ ప్రారంభించి ఓ చిన్న షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. మరీ.. ఈసారి ముగ్గురు భామలతో మన మన్మధుడు ఆడియన్స్‌ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాడో చూడాలి.


