టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. శ్రీ లీలకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం యంగ్ హీరోలతోనే కాదు.. మహేష్ బాబు లాంటి సీనియర్ హీరోల సరసన కూడా మెరిసింది. అయితే.. ఈ అమ్మడు ఇటీవల కాలంలో చేసిన సినిమాలు అన్ని ఆడియన్స్‌ను నిరాశపరచడంతో.. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అయ్యినా.. తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంటుంది ఈ కుర్ర బ్యూటీ. తాజాగా.. ఓ బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహం ఖాన్ నటిస్తున్న మూవీ దిలర్ లోను హీరోయిన్గా సెలెక్ట్ అయిందట.

ఇక ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అంటుకుంటే బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ అమ్మడి సొంతమవుతుంది. కాగా.. చివరిగా శ్రీటీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిసిక్‌లో నటించి తన స్టెప్స్‌తో అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇవ్వడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె పుష్ప 2 ఐటమ్ సాంగ్ పై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పుష్ప 2 లాంటి పెద్ద సినిమా నాపై ప్రభావం చూపించింది.. అలాంటి ప్రపంచ రికార్డ్ సాధించిన సినిమాలో భాగమవడం నాకు గర్వకారణంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే.. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానని.. ఇకపై ఎప్పుడు ఏ సినిమాలో.. స్పెషల్ సాంగ్ చేయనే చేయనంటూ చెప్పేసింది.

మళ్లీ ఐటెం సాంగ్ చేసి తప్పు చేయాలనుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దానికి ప్రధాన కారణం.. ఇప్పుడు ఇండస్ట్రీలో నన్ను కేవలం బెస్ట్ డ్యాన్సర్ గా మాత్రమే అందరూ గుర్తిస్తున్నారని.. నాలోని నటన ప్రతిభను ఎవ్వరూ చూడడం లేదని భావిస్తుంతి. నేను కేవలం మంచి డాన్సర్నే కాదు.. మంచి యాక్టర్ ని కూడా అందుకే నా యాక్టింగ్ కూడా అంతా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ వివరించింది. మళ్లీ ఐటెం సాంగ్స్ చేస్తే తను కేవలం డ్యాన్సర్ గానే అందరికీ గుర్తుండిపోతుందని భావిస్తుంది. ఈ క్రమంలోనే తనలోని యాక్టింగ్ స్కిల్స్ తో సత్తా చాటుకునేందుకు సిద్ధమైందట. నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ సినిమాలో నటించాలని డెసిషన్ తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం శ్రీలీల కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.

