కోలీవుడ్ నటుడుఅజ్మల్ అమీర్ ఇటీవల కాలంలో వివాదాల్లో తెగ చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. రంగం మూవీ తో టాలీవుడ్ ఆడియన్స్ దగ్గరైన సినిమాలో కీలకపాత్రలో మెరిసాడు. కానీ.. గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమైన అమీర్.. తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన పేరు తెగ వైరల్‌గా మారిపోతుంది. కొందరు అమ్మాయిలతో అజ్మీర్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడియో క్లిప్ కూడా తెగ సంచలనం సృష్టిస్తుంది. కానీ.. ఆ ఆరోపణలను ఆయన తప్పుపట్టాడు. ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అంటూ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ నాశనం చేయడానికి చూస్తున్నారు అంటూ కామెంట్స్ చేశాడు.

ఈ క్రమంలోని తాజాగా మరోసారి అజ్మల అమీర్‌పై తీవ్ర ఆరోపణలు ఎదురవుతున్నాయి. కోలీవుడ్ నటీ నర్వినీ దేరి ఇటీవల మీడియా ముందుకు వచ్చి.. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అజ్మల్ గురించి నెగటివ్ గా చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేనే కావచ్చు అంటూ నటి నర్విని వివరించింది. గతంలో ఇంటర్వ్యూలో దురాగతాల గురించి వెల్లడించారని.. 2018లో చెన్నైలో అజ్మల్‌ను మొదటిసారి కలిశానంటూ చెప్పుకొచ్చింది. ఆ టైంలో.. తన నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ కావాలని ఫోన్ నెంబర్ తీసుకున్నాడని.. తర్వాత మరుసటి రోజు ఆడిషన్స్ కు రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్ళాక.. వెదర్ చాలా తేడాగా అనిపించింది అంటూ వివరించింది. ఆ టైంలో.. రూమ్ లో తన ఒక్కడే ఉన్నాడని.. అంతా బయటకు వెళ్ళిపోయారు. దీంతో.. ఏదో తప్పు జరగబోతుందని నాకు అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది.

మాటల మధ్యలో చెయ్యి పట్టుకుని డ్యాన్స్ చేద్దామని అడిగాడని,, అప్పుడు ఆయన ఉద్దేశం నాకు అర్థమై,, నేను అలాంటి పనుల కోసం రాలేదని క్లారిటీ ఇచ్చాను అంటూ వివరించింది. దీంతో నా వెనక ఎంత మంది అమ్మాయిలు పడతారో తెలుసా అంటూ గొప్పలు చెప్పుకున్నాడని.. లక్కీగా అజ్మల్‌కు అప్పుడే ఓ ఫోన్ కాల్ రావడంతో నేను అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసా అంటూ వివరించింది. ఇక నేను అప్పుడు కెరీర్ చదువుపై ఫోకస్ చేయాల్సి వచ్చింది. అందుకే.. పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని అనుకున్నానని వివరించింది. కానీ.. ఇప్పుడు ఆయన గురించి అందరికీ తెలియాల్సి ఉంది. అందుకే.. ఓపెన్ అవుతున్నా. ఈ ఘటన తర్వాత కూడా చాలా సార్లు నాకు మెసేజ్ చేశాడు అంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనపై అజ్మల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

