SSMB 29 చిన్న బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ఈ గ్యాప్ లో మహేష్ విన్యాసాలకు ఫ్యాన్స్ ఫిదా..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో భారీ యాక్షన్ అడ్వెంచర్స్ థ్రిల్లర్ ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే.. ఇండియన్ సినీ హిస్టరీ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా రూపొందుతుంది. ఇక ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ నాలుగు స్కెడ్యూలను పూర్తి చేసుకున్న టీం.. ప్రతీ షెడ్యూల్లోను ఇంటర్నేషనల్ లెవెల్ లోకేషన్లను ఎంచుకుంటూ.. షూట్ ను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. చివరగా కెన్యా, టాంజానియా, ఆఫ్రికా లాంటి దేశాల్లో కంప్లీట్ చేశారు. అడవులు, పర్వతాలు, నదులు, ఎడారులు ఇలా దాదాపు అన్ని నేచర్ రిలేటెడ్ లొకేషన్స్ కవర్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్ లు, అడ్వెంచర్స్ సన్నివేశాలను షూట్ ముగ్గించిన‌ట్లు సమాచారం.

BaahubaliTheEpic Special Interview: Prabhas | Rana Daggubati ...

కాగా.. ప్రజెంట్ రాజమౌళి సినిమా షూట్ కు షార్ట్ బ్రేక్ ఇచ్చారు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను తెర‌కెక్కించిన మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీ బాహుబలి సిరీస్‌లను బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ ఎడిట్ చేసి రిలీజ్ చేయడమే. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో.. ట్రైలర్ డిజైనింగ్ లో.. రాజమౌళి బిజీ అయ్యాడు. అక్టోబర్ 31న అంటే.. మరికొద్ది గంటల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ లెవెల్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. గత కొన్ని వారాలుగా రాజమౌళి సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తున్నాడు. దీంతో.. మహేష్ కు చిన్న గ్యాప్ దొరికింది. ఇక.. మహేష్ కు షూట్స్ నుంచి బ్రేక్ దొరికితే చాలు.. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీతో ట్రిప్స్ ఎంజాయ్ చేయడమే.

ఈ క్రమంలోనే.. తాజాగా ఎస్ఎస్ఎంబి 29 బ్రేక్ ని కూడా మహేష్ ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్‌లో ఓ అందమైన రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి. సముద్రం మధ్యలో ఉన్న ఓ విలాసవంతమైన రిసార్ట్లో తీసిన ఈ పిక్స్ మహేష్ ఫేస్‌ కంప్లీట్ గా రివీల్ చేయకపోయినా.. ఆయన రిలాక్సింగ్ మోడ్ మాత్రం అందరిని కట్టిపడేస్తుంది. ఫోటోకి క్యాప్షన్ గా అద్భుతమైన ప్రదేశం.. అద్భుతమైన అనుభవం.. ధన్యవాదాలు. ఈ అద్భుతమైన ఆదిత్యానికి అంటూ మహేష్ బాబు రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో.. సముద్రం మధ్యలో ఇలాంటి విన్యాసాలు ఏంటి మహేష్ అంటూ.. ఇంత బిజీ లోను ఫ్యామిలీతో టైం గడపడానికి ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తున్నారో.. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా అంటూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.