టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు డైరెక్షన్‌లో ఆయన తాజాగా నటించిన మూవీ మాస్ జాతర. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే.. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఆర్టి76 ప్రాజెక్ట్‌ను లైన్ లో పెట్టాడు మాస్ మహారాజ్. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకముందే.. రవితేజకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది.

ఈసారి ఏకంగా చిరంజీవి డైరెక్టర్‌ను రవితేజ లైన్లో పెట్టాడంటూ టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అతను ఎవరో కాదు.. బింబిసారా తో సూపర్ హిట్ అందుకుని.. చిరుతో విశ్వంభర తెరకెక్కిస్తున్న మళ్లీడి వసిష్ట. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇటీవల రవితేజకు ఓ కథ చెప్పారని.. రవితేజ కూడా లైన్ నచ్చడంతో.. ఓకే చెప్పాడంటూ టాక్ నెటింట వైరల్‌గా మారుతుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రవితేజ, నవీన్ పోలిశెట్టి కాంబోలో సినిమా వస్తుందంటూ.. పాపులర్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ వీళ్ళిద్దరి కోసం ఒక కథను సిద్ధం చేశాడనే టాక్ కూడా ఉంది. మరి వసిష్ఠ డైరెక్ట్ చేయబోయే ఈ ప్రాజెక్టు అదేనా.. లేదంటే మరో కథతో రవితేజను రంగంలోకి దింపనున్నాడా.. అనేది వేచి చూడాలి.

