ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో అది తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. కొన్ని సినిమాలకు సంబంధించిన విషయాలను మేకర్స్ ఎంతో గోప్యంగా ఉంచుతున్నా బయటకు తెలియకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక వీడియో క్లిప్, లేదా ఫోటోల రూపంలో లీక్‌బయటకు వైరల్ అవుతూనే ఉంటున్నాయి. దీంతో.. మేకర్స్‌తో పాటు.. సినిమాలో నటించే కాస్టింగ్ సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరో పక్క సోషల్ మీడియా కారణంగా ఇంకా సెట్స్ పైకి కూడా రాని సినిమాలపై కూడా విపరీతమైన హైప్ నెలకొంటుంది. ప్రస్తుతం పుష్ప 3కి కూడా అదే రేంజ్ లో క్రేజ్ మొదలైంది.
ఈ సినిమా కోసం.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై మేకర్స్ కూడా ఇప్పటికీ అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. అయినా నెటింట పుష్ప 3కి సంబంధించిన హంగామా మొదలైపోయింది. కొంతమంది అభిమానులు పోస్టర్లు, వీడియోలను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే పుష్ప 3లో విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్రలు నటిస్తున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. అదే నిజమనిపించేలా ఓ ఫ్యాన్ మేడ్ వీడియోను ఫ్యాన్స్ రిలీజ్ చేశారు. ఇక.. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయిందని.. నిజంగా సుకుమార్ టీం నుంచి లీక్ అయిన వీడియో లాగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప సినిమాకు తగ్గట్టు.. రఫ్ అండ్ రగడ్ లుక్‌లో విజయ్ దేవరకొండను ఎలివేట్ చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి యాక్షన్ సీన్లు అదరగొట్టినట్లు చూపించారు. ఇది.. పుష్ప 3 రియల్ షూట్ లీక్ అని అంతా భావించేలా డిజైన్ చేశారు. కానీ.. వాస్తవానికి ఇది ఫ్యాన్ మేడ్ వీడియో అని క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ వీడియో క్వాలిటీ ,ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్ అంతా రియలిస్టిక్‌గా ఉండడంతో చాలామంది ఈ వీడియోని చూసి ఫీదా అవుతున్నారు. నిజంగా విజయ్ దేవరకొండ పుష్ప 3లో ఉంటే ఇలాంటి లుక్‌లోనే ఉంటాడేమో.. కాస్ట్యూమ్, యాక్షన్ పోజ్, ఎమోషన్స్ వరకు అన్ని అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
#Pushpa3TheRampage anta… 🌋💥@PushpaMovie garu o look eskundi… 😄
Superb creativity… 🫡👏👌@MythriOfficial#AlluArjun #VijayDeverakonda #RashmikaMandanna #fahadhfaasil pic.twitter.com/TgsnpvZy1Y
— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) October 28, 2025

