బిగ్ బాస్ 9 లో ప్రమాదం.. తీవ్ర గాయాలతో హాస్పిటల్ కు భరణి

టాలీవుడ్ బిగెస్ట్‌ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఊహించని మలుపులుతో ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెలకొల్పుతుంది. ఈ క్రమంలోనే.. తాజా నామినేషన్ ప్రాసెస్ తర్వాత హౌస్ లోకి భరణి, శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు. కారణం మొదటి నుంచి భరణిపై సాఫ్ట్ కార్నర్. మంచి మనిషిని అనవసరంగా బయటకు పంపించారని.. ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి ఫీల్ బయటకు రావడం. అలాగే.. శ్రీజను కేవలం వైల్డ్‌ కార్డ్ ఎంట్రీ మెంబర్స్ హౌస్ నుంచి పంపించాశేరు. ఆడియన్స్ కాదన్న వ్యతిరేకత‌ ఏర్పడడంతో.. వీళ్ళిద్దరినీ మళ్ళీ తిరిగి హౌస్ లోకి పంపించాలంటూ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

Bigg Boss Telugu 9: Is Public Backlash the Real Reason Behind Srija and  Bharani's Re-entry? - Telugu360

ఇక ఇందులో భాగంగానే.. నిన్న నైట్ ఒక ఫిజికల్ టాస్క్‌ను హౌస్‌లో నిర్వహించారట. ఇక.. ఈ టాస్క్‌లో హౌస్ లోని అందరికీ గాయాలయ్యాయని.. భరణికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. భరణి స్విమ్మింగ్ పూల్ లో కుప్పకూలిపోవడంతో.. ఆయన వెంటనే బిగ్ బాస్ హౌస్ మెయిన్ డోర్ నుంచి హాస్పిటల్‌కు ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లినట్టు విశ్వాసనీయ‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భరణి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. రిబ్స్‌ వద్ద భారీ గాయాలు జరిగాయని.. అవి సెటై ఫిజికల్ టాస్కులకు సిద్ధంగా ఉన్నాడనిపిస్తేనే భరణిని హౌస్ లోకి మళ్ళీ పంపించే అవకాశం ఉంది.

లేదంటే.. భరణి హౌస్‌కు గుడ్ బై చెప్పేసినట్టే. ఈసారి హౌస్ లో రియంట్రీ ఇచ్చిన వాళ్లు ఉండడానికి బిగ్ బాస్ అవకాశమిచ్చాడు. అయితే తను ఎందుకు బిగ్బాస్ హౌస్ లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారో కంటిస్టెంట్లకు చెప్పి వాళ్లను కన్విన్స్ చేయాలని చెప్పారట. భరణి పాపం ఈసారి ఎలాగైనా హౌస్ లో ఉండిపోవాలని చాలా గట్టిగా టాస్క్ ఆడి.. కష్టపడి ప్రయత్నించాడు. కానీ.. తీవ్ర గాయాలు కారణంగా హాస్పిటల్‌కు చేరాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే భరణి అభిమానులంతా ఆయన త్వరగా కోలుకోవాలని.. ఖచ్చితంగా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకవేళ భరణి హౌస్ లోకి ఇవ్వలేకపోతే.. ఆ ప్లేస్లో మనీష్ లేదా ప్రియా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే.. ఈరోజు ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.