8 గంటల షిప్ట్ డిమాండ్లపై.. రష్మిక క్లారిటీ..!

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పనిగంటలకు సంబంధించిన చర్చ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ దీపిక 5 నుంచి 6 గంట‌ల‌కంటే ఎక్కువ సమయం చేయనని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు ఇలాంటి కండిషన్‌లు ఎందుకు పెడుతున్నారు.. వీళ్ల‌కు సినిమాల కంటే కండిషన్స్ ఎక్కువా.. నిర్మాతలను ఇలాంటి ఇబ్బందులు పెట్టే వారిని ఎందుకు సినిమాల్లోకి తీసుకుంటున్నారు అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే.. ఇతర హీరోయిన్ల స్టేట్మెంట్లు సైతం కీలకంగా మారుతున్నాయి. అయితే.. తాజాగా రష్మిక మందన ఈ పని గంటల చర్చపై రియాక్ట్ అయింది. పనిగంటల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

చాలామందిలో నాకు కూడా నిర్దిష్టమైన పని గంట‌ల్లో పనిచేయాలని ఉంటుంది. ఆఫీస్ టైమ్స్‌లా 9 నుంచి 6 వరకు పని చేయాలని అనుకుంటా. కానీ.. ఒకసారి నిర్మాత ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త అటూ.. ఇటూ సమయం అయినా.. సర్దుకోవాలని రష్మిక వివరించింది. అవ్వాల్సిన టైంలో ఇంకా సెట్స్‌లో తీయాల్సిన సీన్స్ మిగిలి ఉండొచ్చు. తర్వాత రోజు నుంచి.. సెట్స్ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.. అందుకే కాస్త సమయం అయినా.. ఇబ్బంది అయినా.. నా పని పూర్తి చేసి ముందుకు వెళ్తా. సినిమా అంటే కేవలం నేను ఒక్కదాన్నే కాదు కదా.. 100 మంది దానికోసం పనిచేస్తారు. నావల్ల వాళ్లంతా ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు.

అందరికంటే.. నాకు ఎక్కువగా రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా నేను కూడా పనిచేయాలి కదా.. నాకంటూ తినడానికి, నిద్రపోవడానికి అంటూ కొంత సమయం కేటాయించాలి. నేను సమయానికి పడుకొని, వేళ‌కు తింటే ఫిట్గా ఉంటా. అప్పుడే.. ఇంకాస్త బాగా పనిచేస్తా. ఈ విషయాన్ని నిర్మాతలు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే ఎక్కువ టైం సెట్స్ లో పనిచేస్తున్నా. అలసిపోతున్నా సరే.. షూట్‌లో వర్క్ చేస్తూనే ఉన్నా. ఇది మంచిది కాదని నాకు తెలుసు అంటూ వివరించింది. దీపికల 5:00 పని చేస్తే అని చెప్పడం అసలు సరైనది కాదు.. అలాగని మరీ 10 గంటలు 12 గంటలు షూట్‌ చేయడం కూడా కరెక్ట్ కాదు.

సెట్ లో పరిస్థితులను బట్టి, నిర్మాత ఇబ్బందులను బట్టి అర్థం చేసుకుని సమయం అటు ఇటు అయినా సర్దుకుంటా. నాకు ఎంత రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేసి తీసుకుంటున్నప్పుడు.. ఫెసిలిటీస్ అన్ని పోరాడి దక్కించుకున్నప్పుడు.. నిర్మాత అవసరాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సందర్భాన్ని బట్టి కష్టపడాలి కదా.. హీరోయిన్ ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్నప్పుడు ఓకే సినిమా కోసం డెడికేటెడ్ గా పనిచేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు.. సినిమాలను తగ్గించుకుని ప్రోడక్టివ్ టైం ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలు చేస్తే మనకు, నిర్మాతలకు కూడా కంఫర్ట్ గా ఉంటుందంటూ వివరించింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.