కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చివరిగా కూలీ సినిమాతో యావరేజ్ గ్రాస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. 2023లో రిలీజ్ అయిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి.. రూ.600 కోట్ల పైగా గ్రాస్ కొల్లగొట్టిన ఈ సినిమా.. తెలుగులోనూ రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. వరుస ఫ్లాప్స్‌ని ఎదుర్కొంటున్న రజినీకి స్ట్రాంగ్ త్రో బాక్ ఇచ్చేలా చేసింది. ఈ జనరేషన్ ఆడియన్స్‌కు సైతం రజిని స్టామినా అర్థమైంది. ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వల్గా జైలర్ 2 సినిమా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం సినిమా షూట్ తుది దశకు చేరుకోవడంతో హైప్ మరింతగా పెరిగింది. ఇక.. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. విలన్ రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉండనుందని.. నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి మధ్య పోటీ నడుస్తుందట. జైలర్ సినిమా క్లైమాక్స్ లో విలన్.. నావెనక ఎవరున్నారో నీకు తెలియదు.. ఇది ఒక పెద్ద సామ్రాజ్యం అని పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు గుర్తుందా.. ఇప్పుడు పార్ట్ 2 లో ఆ పెద్ద సామ్రాజ్యానికి సంబంధించిన మరో వ్యక్తి అంటే ఇంకా పవర్ఫుల్ గా విలన్‌ను చూపించనున్నారట. అంతేకాదు.. పార్ట్ 2 లో విలన్‌తో పాటు.. ఆయన కుటుంబం కూడా రజినీతో తలపడుతుందని.. మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి నటించనున్నట్లు తెలుస్తుంది.

ఆయన కూతురుగా.. బాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ, నేషనల్ అవార్డు గ్రహీత విద్యాబాలన్ నటించనుందని సమాచారం. ఇందులో ఆమె హీరోయిన్ కాదు.. విలన్ కూతురుగా మెరవనుందట. ఈ క్రమంలోనే తండ్రికి తగ్గ కూతురుగా నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తుందా.. లేదా తండ్రి చేసే అక్రమాలు నచ్చక హీరోకు సపోర్ట్ చేసే క్యారెక్టర్లో ఆమె కనిపించనుందా.. వేచి చూడాలి. అంతేకాదు.. ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ఈ వార్త చాలా సార్లు వైరల్‌గా మారింది. బాలయ్య ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. అలాగే ఫస్ట్ పార్ట్ లో గెస్ట్ రోల్ లో కనిపించిన శివరాజ్ కుమార్.. సెకండ్ పార్ట్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడట. సినిమా కూడా చాలా బాగా రూపొందుతుందని టాక్. మరి నెల్సన్ జైలర్ 2 తో మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడా.. లేదా.. చూడాలి.

