టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్ లోను అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే.. ఇటీవల కాలంలో అమ్మడి క్రేజ్ టాలీవుడ్లో కాస్త తగ్గిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈమె ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే అమ్మడి కెరీర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే.. ఈ సినిమాతో పాటు రవితేజ సరసన మాస్ జాతర సినిమాతో కూడా ఆడియన్స్‌ను పలకరించనుంది.
రవితేజ, శ్రీ లీల కాంబోలో గతంలో తెరకెక్కిన ధమాక ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు.. అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ సినిమా హిట్ అయితే శ్రీ లీలకు తిరుగులేని ఇమేజ్ వస్తుంది అనడంలో సందేహం లేదు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉంటూనే.. సమయం దొరికినప్పుడల్లా పలు షోలు, ఇంటర్వ్యూలో సందడి చేస్తూ.. ఆడియన్స్‌కు దగ్గరవుతుంది. ఇందులో భాగంగానే.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీలా.. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు కాబోయే వ్యక్తి అందంగా ఉండకపోయినా పర్లేదు కానీ.. నన్ను ఎక్కువగా అర్థం చేసుకునేలా ఉండాలంటూ వివరించింది.
నాకు సపోర్ట్ చేయాలని, ఎక్కువ కేరింగ్ గా చూసుకోవాలంటూ చెప్పుకొచ్చింది. నాతో జోయెల్గా ఉండాలి.. అన్నింటికంటే ముఖ్యంగా హానెస్ట్‌గా ఉండాలంటూ వివరించింది. అలాంటి క్వాలిటిస్ ఉన్న వ్యక్తి నన్ను కలిసినప్పుడు కచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకుంటా అంటూ వివరించింది. అంతేకాదు.. తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడం పై రియాక్ట్ అవుతూ.. కేవలం గ్లామర్ పాత్రలే కాదు.. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో చేయాలని చూస్తున్నా.. అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయాలనుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

