నారా రోహిత్ పెళ్లి సందడి షురూ.. పెళ్ళికొడుకు ఈవెంట్లో లో సందడి చేసిన బాలయ్య, లోకేష్ ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుడు.. దివంగత నారా రామ్మూర్తి నాయుడు తనయుడు.. టాలీవుడ్ క్రేజీ హీరో నారా రోహిత్ పెళ్లి వేడుకలు తాజాగా గ్రాండ్ లెవెల్‌లో మొదలైన సంగతి తెలిసిందే. ప్రతినిధి 2 సినిమాలో త‌న‌తో కలిసి హీరోయిన్గా మెరిసిన సీరి లెళ్లతో ప్రేమలో పడిన రోహిత్ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ లెవెల్ లో ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ జంట పెళ్లి వేడుకలు మొదలైపోయాయి.

నారా వారి ఇంట మరో రెండు రోజుల్లో పెళ్లి భాజలు మోగనున్నాయి. ఈ క్రమంలోనే శనివారం (అక్టోబర్ 25న‌) సాయంత్రం గ్రాండ్ లెవెల్‌లో హాల్ది వేడుకలను జరిపారు. ఈ ఈవెంట్‌లో నారా కుటుంబంతో పాటు.. ఇతర బంధుమిత్రుల సైతం హాజరై సందడి చేశారు. ఇక నేడు అక్టోబర్ 26న ఉదయం నారా రోహిత్‌ను పెళ్లి కొడుకుని చేసే ఫంక్షన్ జరిగింది. ఇక ఈ ఫంక్షన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నారా రోహిత్ అన్న నారా లోకేష్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

డాడీ😘😘ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఈరోజు హైదరాబాద్ చేరుకుని నారా రోహిత్ ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి హాజరైన మంత్రి నారా లోకేష్ గారితో ...

ఏపీ మంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి కొడుకు ఫంక్షన్‌లో సందడి చేశాడు. అలాగే.. వేడుక అంతటికీ హైలెట్గా మారిన మరో స్పెషల్ పర్సన్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ. ఆయన సైతం నారా వారి ఇంట జరిగాన ఈ పెళ్లి వేడుకలకు హాజరైన వ‌రుడిని ఆశీర్వదించారు. వీళ్ళతో పాటే ఈ పెళ్ళికొడుకు ఫంక్షన్‌కు పలువురు రాజకీయ నాయకులతో పాటు.. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మీరు ఓ లుక్ వేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)