టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల కాలంలో సక్సెస్ లతో మంచి జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక సినిమాను భారీ లెవెల్లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బోయపాటి తెరకెక్కించనున్నాడంటూ టాక్ ఎప్పటినుంచో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. సినిమా షూట్ ఇప్పటికే కంప్లీట్ అయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సర్వే గంగా జరుగుతున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ తెగ వైరల్ గా మారుతుంది.
భారీ యాక్షన్స్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ ఇష్యూస్ పై కూడా టీం ఫుల్ ఫోకస్ పెట్టారట. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈసారి బాలయ్యను మరింత డివోషనల్ గా మాస్‌టచ్‌ను జోడించి ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా తెరకెక్కించనున్నాడట. ఈ క్రమంలోనే.. సినిమాను ఇంత గ్రాండ్ లెవెల్లో డిజైన్ చేసిన బోయపాటి.. ఒక్క విషయంలో మాత్రం బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడు. అది ఫాన్స్ లో తీవ్రమైన నిరుత్సాహాన్ని కల్పిస్తుంది అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. భారీ లెవెల్లో ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ప్రాజెక్టు నుంచి.. ఒక్క సరైనా అప్డేట్ కూడా రాకపోవడం ఫ్యాన్స్‌లో నిరాశను కలిగిస్తుంది. దీవాలి సెలబ్రేషన్స్ కూడా పూర్తయిపోయినా.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన మినిమం అప్డేట్స్ కూడా ఆడియన్స్ కు మేకర్స్ అందించలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. అఖండ 2 తాండవం చిన్న ప్రమోషనల్ క్యాంపైన్ కూడా మొదలు కాలేదు. కనీసం సినిమా నుంచి స్పెషల్ లుక్, లేదంటే టీజర్, అట్లీస్ట్ ఫస్ట్ సింగిల్ పైన ఏదైనా అఫీషియల్ ప్రకటన వచ్చి ఉంటే ఫ్యాన్స్ కు కాస్త ఆనందం ఉండేది. కానీ.. బాలయ్య అభిమానులు ఆశిస్తున్న ఏ చిన్న అప్డేట్ని కూడా మేకర్స్ సినిమా నుంచి రివీల్ చేయకపోవడంతో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవుట్‌డోర్ ప్రమోషన్స్ లేకపోయినా.. కనీసం సోషల్ మీడియా ఇంట్రాక్షన్ ద్వారా అయినా ఆడియోస్ కోరుకుంటున్న ఏ చిన్న అప్డేట్ అయినా రివీల్ చేస్తే సినిమా పైన ఓ నూతన ఉత్సాహం నెలకొన్నేది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. బోయపాటి ఎలాంటి చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా పనులు పూర్తి చేస్తున్న క్రమంలో ఇప్పటికైనా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలని.. లేదంటే సినిమాపై ఉన్న ఉత్సాహం కాస్త ఫ్యాన్స్ లో ఆగ్రహానికి కారణం అవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క చిన్న పోస్టర్ రిలీజ్ అయినా చాలు.. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుందన్నడంలో సందేహం లేదు.