గూడచారి గా ప్రభాస్.. బ్రిటిష్ జెండాపై నడుస్తూ.. అసలు స్టోరీ ఏంటి హను..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన లైన‌ప్‌ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో క్రేజీ అప్డేట్ తో ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ కు ప్రీ బర్డ్ ట్రీట్ అని అనడంలో అతిశయోక్తి లేదు. క్రియేటివ్ డైరెక్టర్ హ‌ను రాఘవపూడి, బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కాంబినేషన్లో.. ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాను ఫౌజి రన్నింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

ఈ ప్రాజెక్టు పై మొదటి నుంచి ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. సీతారామం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన హ‌ను తీస్తున్న సినిమా కావడం.. అది కూడా ప్రభాస్ హీరోగా రూపొందడంతో ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను డబ్బల్‌ చేస్తూ.. మేకర్స్‌ సినిమా ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా అంటే చాలా ఆసక్తిగా మంచి డీటెయిలింగ్‌తో క్యూరియాసిటీని పెంచేలా డిజైన్ చేశారు. ఇందులో ప్రభాస్ ఫుల్ లుక్ రివిల్ చేయలేదు. కానీ.. ఆయన స్టిల్‌ను రివీల్ చేస్తూ హింట్ ఇచ్చారు. స్టైలిష్ సూట్ లో.. చేతిలో ఒక బ్రీఫ్ కేస్ తో నడుస్తున్నట్లు ఆ లుక్ చూపించారు.

ఆయన నడుస్తున్న నేలపై బ్రిటిష్ జెండాలను పరిచిన్నట్లు పోస్టర్లో ఉంది. బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధ వాతావరణ కనిపిస్తున్న క్రమంలో.. 1940 నాటి వలస భారతదేశం నేపథ్యంలో సాగే కథ‌ అని అర్థమవుతుంది. పోస్టర్ పై ఉన్న ట్యాగ్ లైన్స్ మరింత ఆసక్తిని పెంచేసాయి. మోస్ట్ వాంటెడ్ సీన్స్ 1932 ఒంటరిగా నడిచే సైన్యం అనే లైన్ ను.. ప్రభాస్ పాత్ర స్వభావానికి జోడించారు. సినిమా జోనర్‌పై హింట్ ఇస్తూనే,. ఈ పోస్టర్ను రివిల్ చేయడం ఆడియన్స్ లో ఆసక్తి ని పెంచింది. దీన్ని బట్టి.. ఇది ఒక పిరియాడికల్ స్పై థ్రిల్ల‌ర్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. ప్రభాస్ ఒక రెబల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు.. పోస్టర్ బూ z టుమారో అని రాసి ఉంది. అంటే.. అక్టోబర్ 22న‌.. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక.. ఈ సినిమాకు ఓజీ టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. అయితే.. ఈ ప్రీ లుక్ పోస్టర్ ఈ రేంజ్‌లో ఉంటే.. ఫస్ట్ లుక్ ఎలా ఉండిపోతుందో అని ఆసక్తి అభిమానులు మొదలైంది.