టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మురారి, ఒకడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి వరుస సక్సెస్ లతో టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచాడు. ఇక.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. మహేష్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.

ఇండస్ట్రీలో ప్రజెంట్ ఉన్న దర్శకులు ఎవరైనా.. మహేష్ లాంటి హీరోతో సినిమా అంటే వెంటనే ఒప్పేసుకుంటారు. కానీ.. ఓ డైరెక్టర్ మాత్రం మహేష్ బాబుతో సినిమాలు చేసి తన కెరీర్‌లోనే బిగ్ మిస్టేక్ చేశాను అంటూ షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఇంతకీ.. ఆ డైరెక్టర్ మరెవరో కాదు గుణశేఖర్. మహేష్ తో గతంలో ఒకటి కాదు.. రెండు కాదు మూడు సినిమాలను తెరకెక్కించారు. వాటిల్లో మొదటిది ఒక్కడు. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత కొంతకాలానికి వీళ్ళిద్దరూ కలిసి అర్జున్ సినిమాతో పనిచేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌ని దక్కించుకుంది. తర్వాత.. గుణశేఖర్, మహేష్ కలిసి చేసిన మూవీ సైనికుడు. ఈ సినిమా టాలీవుడ్ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ క్రమంలోనే తాజాగా గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్తో వరుసగా మూడు సినిమాలు చేయడమే నా కెరియర్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మహేష్ ఒక మత్తు లాంటి వ్యక్తి.. అతనితో కలిసి పని చేస్తే ఆయన మాయలో పడేస్తాడు. అందుకే వరుసగా మూడు సినిమాలు మహేష్‌తోనే చేశా అంటూ గుణశేఖర్ వివరించాడు. మహేష్ తన నటనతో దర్శకులకు సవాలు విసురుతాడని.. మనం 100%ఇవ్వమంటే.. ఆయన 200% ఎఫర్ట్స్ పెడతారని.. అందుకే అతనితో మూడు సినిమాలు చేశా అంటూ.. గుణశేఖర్ వివరించాడు. అలా.. వరుసగా మహేష్‌తోనే సినిమాలు తీయకుండా.. మరో హీరోతో సినిమా చేసి తర్వాత మహేష్‌తో చేసి ఉంటే వాటి రిజల్ట్ వేరేలా ఉండేదంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

