ఆర్ సి 17: చరణ్ మ్యాటర్ లో సుక్కు బిగ్ కన్ఫ్యూజన్.. కారణం అదేనా..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రతి సినిమాలో.. కంటెంట్ ఏదైనా సరే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తూ.. ఒక సినిమాను మించిపోయే రేంజ్‌లో మరో సినిమాతో సక్సెస్‌లు అందుకుంటున్నాడు. అంతకంతకు ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ నేప‌ద్యంలో చివ‌రిగా పుష్ప ఫ్రాంఛైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సుకుమార్.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమాకు సిద్దమైన సంగతి తెలిసిందే. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్‌లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబో రిపీట్ కానుంది. దీంతో.. సినిమా సెట్స్‌ పైకి కూడా రాకముందే.. ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది.

తన ప్రతి సినిమా విషయంలో.. ఎంతో స్పష్టతను మెయింటెన్ చేసే సుకుమార్.. చరణ్‌ తీయబోయే సినిమా విషయంలో మాత్రం.. బిగ్ కన్ఫ్యూజ‌న్‌ను ఎదుర్కొంటున్నాడట. అది కూడా.. హీరోయిన్ సెలక్షన్ విషయంలో అంటూ టాక్‌ నడుస్తుంది. మొదట.. ఈ సినిమా కోసం ఓ హీరోయిన్ ఫిక్స్ చేశాడట. కానీ.. తర్వాత ఆప్షన్ ను చేంజ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. ఇక సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత.. మొదట చరణ్ సరస‌న‌ రష్మిక నటిస్తుందని.. తర్వాత జాన్వి కపూర్, ఆ తర్వాత రుక్మిణి వసంత్‌ పేర్లు వైరల్ గా మారాయి. అయితే.. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి పేర్లు కాకుండా కృతి స‌న‌న్ మెరబోతుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. సుకుమార్‌ ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ఏ సినిమా విషయంలోనైనా హీరోయిన్ సెలక్షన్లో మాత్రం ఇంత ఆలస్యం చేయలేదు.

RRR' Star Ram Charan Sets Next Project With 'Pushpa' Director Sukumar

పాత్రకు తగ్గ ఒక పర్ఫెక్ట్ వ్యక్తిని ఎంచుకొని ఆమెనే హీరోయిన్గా ఫిక్స్ చేసేవాడు. కానీ ఆర్సి 17 విషయంలో మాత్రం తాను రాసిన కథ మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుందని.. అందుకే సుకుమార్ ఈ పాత్రలో నటించబోయే హీరోయిన్ సెలక్షన్ విషయంలో అసలు ఎక్కడ తడపడ కూడదని మెల్లగా డెసిషన్ తీసుకుంటున్నాడట. ఇక.. స్క్రిప్ట్ ప‌నుల‌ విషయంలోనూ ఆయన ఆలస్యం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఏ చిన్న పొరపాటు లేకుండా.. ఫుల్ పర్ఫెక్షన్ తో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతోనే ప్రతి విషయంలోనూ ఇంత ఆలస్యం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక్కడ మమ్మల్ని సినిమాపై సినీ విశ్లేషకులు సైతం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఎంత ఆలస్యం చేసినా తుది నిర్ణయం కచ్చితంగా సక్సెస్ అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.