ఒకసారి రాజమౌళిని నమ్మి మోసపోయిన నాగ్.. మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడా..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ యంగ్ లుక్. ఫిట్నెస్తో కుర్రకారును కట్టిపడేస్తున్నాడు. ఈ జనరేషన్ అమ్మాయిలు సైతం మన్మధుడుగానే అభిమానిస్తున్నారంటే తన సినిమాలతో ఆడియన్స్‌ను నాగ్ ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నారో అర్ధం అవుతుంది. కాగా.. నాగార్జున ఇప్పటివరకు హీరోగా తన సినీ కెరీర్‌లో 99 సినిమాలను కంప్లీట్ చేసి ..100వ‌ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నాగ్ కెరీర్‌లోనే ఓ మైల్ స్టోన్‌గా నిల‌వ‌నుంది. ఈ క్రమంలోనే.. 100వ‌ సినిమా కోసం.. తమిళ్ డైరెక్టర్ కార్తీక్‌ను ఎంచుకున్నాడు నాగ్. ఈ క్ర‌మంలోనే ఆ సినిమా విషయంలో విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

Nagarjuna's 100th film to be with Tamil filmmaker R Kartik; official  announcement on this date

దానికి కారణం తమిళ్ డైరెక్టర్‌ను ఎంచుకోవడం తెలుగులో ఎంతోమంది స్టార్ దర్శకులు ఉంటే.. నాగార్జున తమిళ్ డైరెక్టర్‌తో 100వ‌ సినిమా చేయడం ఏంటి అంటూ.. ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే.. నాగార్జున, కార్తీక్ తోనే సినిమా చేయడానికి కారణం రాజమౌళినే అంటూ ఓ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. నాగార్జున 100వ సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్న కార్తీక్.. రాజమౌళి తనయుడు. కార్తికేయకు క్లోజ్ ఫ్రెండ్ అట. ఈ క్రమంలోనే.. రాజమౌళిని నాగార్జున దర్శకుడుగా సెట్ చేసినట్లు సమాచారం. మొదట నాగార్జున.. కార్తీక్ చెప్పిన కథను విని ఎమోషన్స్ ప్రాపర్‌గా లేవని రిజెక్ట్ చేశాడట. కాగా.. అప్పుడే జక్కన్న రంగంలోకి దిగి చాలా వరకు సీన్స్ మార్చి నాగార్జునను ఓపెన్ చేసాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

Rajanna' standards - Rajamouli or VP!? | cinejosh.com

ఈ సినిమా వెనుక నేనుంటానని రాజమౌళి హామీ ఇవ్వడంతోనే నాగార్జున.. కార్తీక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక గతంలో.. రాజమౌళి చేతిలో నాగార్జున ఒకసారి మోసపోయిన సంగతి తెలిసిందే. జక్కన తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్లో రాజన్న సినిమాలు నాగార్జున నటించారు. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ అన్ని నేను చూస్తాను అని రాజమౌళి హామీ ఇచ్చాడు. అయితే సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు సరికదా.. ఎంతోమంది సినీ మేధావులు నుంచి పలు విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గతంలో రాజమౌళిని నమ్మి బొక్క బార్ల పడ్డ నాగ్‌.. మళ్ళీ 100వ‌ సినిమా విషయంలోనూ అదే తప్పు చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ విరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారైనా నాగార్జున పెట్టుకున్న నమ్మకాన్ని రాజమౌళి నిలబెడతాడా.. లేదా.. నాగ్‌ ఎలాంటి సక్సెస్ ఇస్తారో వేచి చూడాలి.