బిగ్ బాస్ 9 భరణి ఎలిమినేషన్.. హౌస్ మొత్తం షేక్..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 9 సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఎట్టకేలకు వీకెండ్ రానేవచ్చేసింది. అయితే ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందట. కచ్చితంగా టాప్ 5కి ఎంట్రీ ఇస్తాడు అనుకున్న స్ట్రాంగ్ కంటిస్టెంట్ భరణి శంకర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కొన్ని గంటల క్రితమే ముగిసింది. డేంజర్ జోన్‌లో భరణితో పాటు.. రాము రాథోడ్ వెళ్లారు. ఇక వీళ్లిద్దరి మధ్యన జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో భరణి ఎలిమినేట్ అయ్యి రాము సేఫ్ అయ్యారని టాక్. ఒకవేళ ఇమ్ము పవర్ అస్త్రాను ఉపయోగించడానికి ముందుకు వచ్చిన రాము రాథోడ్ కోసం భ‌ర‌ణి.. దాని రిజెక్ట్ చేశాడా తెలియాల్సి ఉంది. అంతేకాదు.. తనుజా, దివ్య తనను నాన్న అంటూ ఎంతో ఎట్చ్‌మెంట్ పెంచుకున్న సంగతి తెలిసిందే.

Bharani Shankar (Bigg Boss 9) Age, Biography, Wiki, Date Of Birth, Movies List #bharanishankar #bharanishankararmy #biggboss9 #biggbosstelugu #biggbosstelugu6 #biggboss9telugu #biggboss9promo #cinefry https://www.cinefry.co.in/bharani-shankar-biography/

ఈ క్రమంలోనే.. వాళ్ళిద్దరికీ తన వల్ల ఎలాంటి ఎమోషనల్ స్ట్రెస్‌ కలగకూడదని.. మంచిగా గేమ్ ఆడాలని ఉద్దేశంతో తను ఎలాంటి అస్త్రాన్ని ఉపయోగించుకోకుండా త్యాగం చేశాడా వేచి చూడాలి. ఇక హౌస్ లో భరణి పర్ఫామెన్స్ విషయానికొస్తే హౌస్ లో అతి మంచితనం పనికిరాదనడానికి బిగ్గెస్ట్ ఎగ్జామ్ పుల్‌. ఆయ‌న స్ట్రాంగ్ కంటెంట్ గా హౌస్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ వయసులోనూ కుర్రాళ్లకు సైతం గ్రాండ్ కాంపిటీషన్ ఇచ్చి స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. అయితే.. తన తోటి కంటెస్టెంట్‌ అయిన.. తనూజ, దివ్యలతో రిలేషన్ కారణంగా భరణి గేమ్ పాడైపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళతో రిలేషన్ లో ఉన్న సొంత గేమ్ వచ్చినపుడు మాత్రం స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు.

Tanuja Vs Bharani Vs Divya | Bigg Boss Telugu 9 | Day 40 Promo 3 | #biggbosstelugu9 #bb9telugu

వారిని కానీ.. తనుజ, దివ్యలతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ షోకు హైలెట్‌గా మారింది. ఈ క్రమంలోనే.. భరణి పడిన కష్టం ప్రేక్షకులు గుర్తించలేకపోయారు. ఈ కారణంగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. దానికి తోడు ఈ వారం తనని తాను హైలైట్ చేసుకునేలా ఎలివేట్ అయ్యేలా టాస్కులు కూడా పెద్దగా పడలేదు. అది కూడా.. భరణికి బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. ఇక భరణి ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం షాక్ అయినట్లు తెలుస్తోంది. తనూజాను ఓదార్చడం అయితే ఎవరి తరం కాలేదని టాక్. అయితే.. ఇప్పటివరకు హౌస్ మొత్తాన్ని కంటతడి పెట్టించిన ఒకేఒక్క ఎలిమినేషన్ భరణి అనడంలో సందేహం లేదు. ఆ రేంజ్‌లో హౌస్‌లో ఉన్న మెంబర్స్ తో ఆయన ప్రేమ అనుబంధాలను పెంచుకున్నారు. మంచి ఇమేజ్ను సంపాదించుకున్నాడు. మొదట మూడు వారాలు తనూజతో ఆయన మంచి బాండింగ్ ఏర్పరచుకున్నా ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. కానీ.. దివ్య ఎప్పుడైతే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో.. గేమ్ మొత్తం చేంజ్ అయిపోయిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.