స్టార్ హీరోయిన్ సమంతకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్‌లోనే కాదు.. నార్త్ లోను అమ్మడు ప్రజెంట్ తన సత్తా చాటుకుంటుంది. ఇక.. సమంత సినిమాలే కాదు.. పర్సనల్ లైక్ కూడా తెరిచిన పుస్తకమే. నాగచైతన్య విడాకుల దగ్గర నుంచి.. మయోసైటీస్ వ్యాధి బారిన పడడం.. దానినుంచి కోల్పోవడం.. మళ్లీ తెరపై కనిపించేందుకు సిద్ధమవుడం.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయలే. కాగా.. తాజాగా సమంత ఓ ఇంటర్నేషనల్ సమీట్లో పాల్గొని సందడి చేసింది. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. తన పర్సనల్, సినిమాల విషయాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా ఆమె రియాక్ట్ అయ్యింది. సమంత మాట్లాడుతూ.. నా లైఫ్‌లో జరిగిన ప్రతిదీ ప్రజల సమక్షంలోనే జరిగిందంటూ చెప్పుకొచ్చింది. విడాకుల విషయంలో.. హెల్త్ విషయంలో.. ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. ఎంతో స్ట్రగుల్ అయ్యాను.. అందరికీ తెలుసు. ఆ టైంలో నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో అలా ఉంది కనుక ఇలా జరిగిందంటూ ఎన్నో జడ్జిమెంట్లు చేశారు. నా లైఫ్ లో జరుగుతున్న వాటికి ఆన్సర్ నాకు తెలియదు. కానీ.. నేను తప్పులు చేశా, దెబ్బలు తిన్నా. ఇప్పుడు బెటర్ అయ్యా అంటూ వివరించింది.
దీంతో.. ఆమె చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక.. ఈ అమ్మడు ప్రజెంట్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రక్త బ్రహ్మాండ్ అనే సినిమా షూట్ లో బిజీగా గడుపుతుంది. ఇక.. ఈ సినిమాతో పాట్టే.. తన ఓన్ బ్యానర్ ట్రలాలా ప్రొడక్షన్స్‌పై మా ఇంటి బంగారం సినిమాలోను.. ఈ అమ్మడు మెరవనుంది. నందిని రెడ్డి సినిమాకు దర్శకురాలుగా వివహరిస్తుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత.. సమంత చేస్తున్న ఈ రెండు సినిమాలో ఆమెకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.