బిగ్బాస్ సీజన్ 9 తెలుగు ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతుంది. గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆరుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఆరుగురు హౌస్‌లోకి ఒక్కొక్కరు ఒక్కో స్పెషల్ పవర్‌తో ఎంట్రీ ఇచ్చారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఒకరైన మాధురి మాట తీరుపై కేవలం హౌస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు.. షోను బయట నుంచి చూస్తున్న ఆడియన్స్ కూడా.. ఇబ్బందిగా ఫీలయ్యారు. ఈ క్రమంలోనే.. నాగార్జున ఈమె గురించి మాట్లాడతారా.. లేదా.. తను తప్పులను ఆమెకు అర్థమయ్యేలా కన్వే చేస్తారా.. లేదా.. అసలు మాధురి గురించి టాపిక్ తీస్తారా లేదా.. అని ఆసక్తి మొదలైపోయింది.
ఎట్టకేలకు మళ్ళీ వీకెండ్ రానే వచ్చేసింది. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ కంటెంట్ల పర్ఫామెన్స్ పై నాగార్జున మాట్లాడాడు. వచ్చి రాగానే ఇవాళ ఎంత హుషారుగా ఉన్నారు ఏంటి అంటూ కామెంట్స్ చేసిన నాగ్.. తర్వాత కాప్టన్ గౌరవ్‌తో ఐదు కిరీటాలు ఐతు వైల్డ్ కార్డ్స్‌కు ఇచ్చే అంటూ చెప్పుకోచ్చారు. ఇప్పుడు.. నేను ఒక వైల్డ్ కర్డ్ కంటెస్టెంట్‌ని పిలుస్తా.. ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మాత్రమే. వాళ్ళు డిసర్వార్డ్ అన్ డిసర్వ్ అని చెప్పాలి. ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేయండి. ఈరోజు ఆడియన్స్ ఫుల్ హుషారుగా ఉన్నారు. బీ రెడీ విత్ ఓటింగ్ అంటూ నాగ్ అసలు మ్యాటర్ చక చక రివిల్ చేశాడు. ముందు మాధురికి ఆ పవర్ ఉందో లేదో డిసైడ్ చేయాలి. సుమన్.. మాధురికి, కళ్యాణ్ కి మధ్య ఒక ఇష్యూ జరిగింది. అందులో తప్ప ఎవరిదని అడగగానే.. మాధురిదే సార్ అని వివరించాడు.
మీరు ఇలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని కళ్యాణ్ అన్నాడు సార్ అంటూ మాధురి గుర్తు చేసింది. బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని నాగ్.. ఆ వీడియోను రివిల్ చేశాడు. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పు ఉంది అంటూ కళ్యాణ్, మాతురి ఇద్దరిపై ఆయన ఫైర్ అయ్యాడు. సర్.. నా వాయిస్ ఇలానే ఉంటుందని మాధురి కవర్ చేయబోతే.. కాదమ్మా ఇప్పుడు అలా లేదు కదా.. అంటూ ఫైర్ అయ్యాడు. మాటతీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది అని.. ఓకే ఆడియన్స్ థమ్సప్, నాట్ థమ్సప్ ఓట్ చేయమన్నారు. దీంతో.. 40% యస్, 60% నో అని ఓటింగ్ ఇచ్చారు. దీంతో మాధురి ఎలిమినేషన్ను రద్దు చేసే పవర్ కి అర్హత కోల్పోయింది. ఆ షీల్డ్ లో ఉన్న ఆవిడ పవర్ స్టోన్ తీసేసేయండి అంటు నాగ్ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారడంతో.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మాధురిని హైడ్ చేస్తే.. ఆడియన్స్ మాత్రం ఆమె సూపర్ పవర్‌ని తీసేయడం 100% కరెక్ట్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.