టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని కింగ్ నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమదైన స్టైల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ.. హీరోలుగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కొడుకులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోలుగా రాణిస్తున్నా.. ఇప్పటికీ తనదైన స్టైల్, గ్రేస్‌తో వాళ్లకు టఫ్ కాంపిటీషన్ అందిస్తూ దూసుకుపోతున్నారు. ఇక నాగార్జున అయితే.. ఏజ్‌తో సంబంధం లేకుండా.. ఇప్పటికీ మన్మధుడులా యంగ్ లుక్, ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. అసలు తగ్గేదెలా అంటూ.. తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఈ జనరేషన్ లేడీస్‌ని సైతం ఫిదా చేస్తున్నాడు.
ఇక ప్రజెంట్ నాగార్జున కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బిగ్ హైలెట్ ఏంటంటే.. అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడే అనుష్క శెట్టి సినిమాలో మెరవనుందట. నాగార్జున, అనుష్క కాంబో అంటే స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ కామియో రోల్ ఉందని.. మొదటి సినిమా కోసం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే మేకర్స్ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని.. రజనీకాంత్ కంటే టాలీవుడ్ హీరో మెగాస్టార్‌ను తీసుకుంటే పాత్రకు మరింత పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే.. ఆయనను అప్రోచ్ అయినట్లు సమాచారం. ఇక.. చిరంజీవి, నాగార్జునలకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చిరు.. విషయాన్ని విన్న వెంటనే స్నేహితుడి కోసం ఆ స్పెషల్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకు రాజకీయపరంగా, సినిమాలపరంగా ఎన్నో రూమర్లు, ఎన్నో పోటీలు నెలకొన్నా.. వీళ్ళ స్నేహం మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరలేదు. ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ.. తమకు అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం అందించుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. సినిమాలను సైతం ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున సినిమా కోసం చిరంజీవి క్యామియో రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే.. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట ట్రెండింగ్‌గా మారడంతో కొందరు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసినా.. మరికొందరు మెగా ఫాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. మెగాస్టార్.. హీరో నాగార్జున సినిమాల్లో ఒక చిన్న పాత్రలో కనిపించడం అంటే ఆయన రేంజ్ తగ్గిపోతుందని.. కచ్చితంగా చిరుకు నష్టం కలిగే అవకాశం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.