కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో వరుసగా సక్సెస్‌లు అందుకున్నాడు. అయితే.. ప్రదీప్ కు సిక్స్ ప్యాక్, బాడీ వైట్ స్కిన్ టోన్ లేకపోయినా కేవలం కంటెంట్ పై ఉన్న నమ్మకం తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకోగలనే నమ్మకంతోనే సినిమాలను తీసి సక్సెస్ అందుకున్నాడు. దాదాపు.. తన సినిమాలతో అందరికీ కనెక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. అక్టోబర్ 17న సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇండియాతో పాటు.. వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. దీంతో.. యూత్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్‌తోనే ప్రదీప్ రంగనాథన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అసలు మేటర్ ఏంటంటే.. తెలుగులో బడా నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ బడా పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో పాటు.. కోలీవుడ్ స్టార్స్‌తోను వరుసగా సినిమాలను రూపొందిస్తుంది. అలా.. తాజాగా ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలో మెరిసింది. ఈ సినిమాల్లో ప్రేమలు బ్యూటీ మమిత బైజు, టిల్లు బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్లుగా మెరిశారు. ఇక.. సినిమాకు సుధా కొంగర అసిస్టెంట్ డైరెక్టర్ కీర్తి అశ్విన్ దర్శకురాలుగా వ్యవహరించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో.. నటినటులు, సాంకేతిక నిపుణులు, రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నింటినీ కలుపుకొని రూ.30 కోట్ల బడ్జెట్ అయ్యిందట. ఈ క్రమంలోనే ప్రదీప్ కు ఉన్న ట్రాక్ నేపథ్యంలో.. తమిళ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి బిజినెస్ జరిగినట్టుంది.
ఇక ఈ సినిమా రిలీజ్‌కు మరి కొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ క్రమంలోనే.. చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షో లను ప్రదర్శించనున్నారు మేకర్స్. మంగళవారం రాత్రి నుంచి ఓవర్సీస్‌లో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ క్రమంలోనే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తోంది. అమెరికాలో డ్యూడ్‌కి తమిళ్ వర్షన్ కంటే.. తెలుగు వర్షన్‌లో ఎక్కువ బుకింగ్ జరగడం విశేషం. అక్టోబర్ 15 వరకు డ్యూడ్‌కు అమెరికాలో రూ.263 సెంటర్లు 57 వరకు పర్మిషన్ దక్కింది. ఇప్పటికే.. ఈ సినిమా 3989 టికెట్లను సేల్ చేసేయడం విశేషం. దీంతో.. తమిళ్ వర్షన్ కు 27,000 డాలర్లు తెలుగు వర్షన్‌కు 32వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ.18.90 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయని సాక్‌నిల్క్ వెల్లడించింది.