రూ.1200 కోట్ల బిగ్ టార్గెట్ తో కాంతార 2.. 13 రోజుల్లో వచ్చింది ఇంతే..!

టాలీవుడ్ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా మూవీ కాంతారా చాప్టర్ 1 భారీ అంచనాల నడుమ తాజాగా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్‌ను దక్కించుకొని రికార్డులు క్రియేట్ చేసింది. వీకెండ్ తర్వాత నుంచి వసూళ్లు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ల‌ను కొల్లగొట్టి పూర్తి లెవెల్‌లో బ్రేక్ ఈవెన్ టచ్ చేసి సూపర్ హిట్‌గా నిలవాలంటే మాత్రం రూ.1200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను కొల్లగొట్టాల్సి ఉంది. అడ్వాన్స్ బేస్‌నై అంత వసూళ్లు దక్కించుకోకపోయినా.. కనీసం రూ.900 కోట్ల గ్రాస్‌ సొంతం చేసుకోవాలి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ రేంజ్‌వసూళ్లు కష్టమే అనిపిస్తుంది.

Kantara A Legend: Chapter 1 (2025) - IMDb

తెలుగు వర్షన్ లో అయితే ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని దక్కించుకుందనే చెప్పాలి. కాగా.. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.645+ కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే దక్కాయి. అంటే.. ఇంకా సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు రూ.270 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు దక్కించుకోవాల్సి ఉంది. ప్రాంతాలవారీగా వచ్చిన వసూళ్ల‌ను ఒకసారి చూస్తే.. కర్ణాటక నుంచి రూ.175 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల నుంచి రూ.94 కోట్ల గ్రాస్, ఆ తర్వాత తమిళనాడు నుంచి రూ.50 కోట్ల గ్రాస్, కేరళ నుంచి రూ.45 కోట్ల గ్రాస్, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.180 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు మాత్రమే సొంతం చేసుకుంది. మొత్తం మీద.. సినిమా షేర్ వ‌సూళ్ల‌ను లెక్కపెడితే.. రూ.316 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది.

Kantara (2022) - IMDb

అయితే.. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.91 కోట్ల వరకు జరగగా.. ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం రూ.60 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే సొంతమయ్యాయి. బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలంటే.. మరో రూ.31 కోట్ల షేర్ వ‌సుళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఇక దీపావళికి.. దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్‌లో అయితే.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే.. కాంతారకు భారీగా కలెక్షన్లు త‌గ్గే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.2,3కోట్ల షేర్ కి మించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ క్రమంలోనే.. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్‌గా పెద్ద ఫెయిల్యూర్ అంటూ టాక్ నడుస్తుంది.