బాహుబలి ది ఎపిక్ రిలీజ్ పై అదుర్స్ అప్డేట్..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని ఏ రేంజ్‌లో పెంచిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, రానా దగ్గుబాటి ,అనుష్క, తమన్నా భాటియా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజై 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న‌ క్రమంలోనే.. మేకర్స్ ఫిలిం రెండు భాగాలను బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్ రీ రిలీజ్ చేయనున్నారు.

Baahubali: The Epic - Wikipedia

కానీ.. ఇందులో మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రెండు భాగాలను ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్‌తో విలీనం చేయనున్నారు. అక్టోబర్ 31, 2025 న స్పెషల్ మూవీ గా పెద్ద స్క్రీన్‌పై రిలీజ్ చేయనున్నారు. తాజాగా.. ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీం అఫీషియల్‌గా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడం విశేషం.

Bahubali The Epic — the new version combining both parts into one🔥Looking forward and super excited to watch this masterpiece again on the big screen. Can't wait to relive the legend! ⚔️ #

ఈ సినిమా రిలీజై.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అడవి శేష్‌, నాజర్, సుబ్బరాజు, సత్యరాజ్‌ కీలక పాత్రలో మెరుసారు. ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇక సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలిసిందే.