టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సీజన్లో చాలావరకు ఏ ఇద్దరు కన్సిస్టెన్సీ అయినా వ్యక్తిగత ఫైటింగ్ లు కొనసాగుతూ వస్తున్నాయి. కానీ.. గొడవలు పడినంత సమయం కూడా కలిసిపోవడానికి పట్టడం లేదు. ఈ క్రమంలోనే షోలో కాస్త మసాలా యాడ్ చేయాలని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యారట. సీజన్‌లో నిఖిల్ మరియు గౌతమ్ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరిగిందో సీజన్ ప్రారంభం నుంచి చివరి వరకు వారు ఎలా కొట్లాడుకున్నారో అంతా కళ్ళారా చూశారు. ప్లాప్ గా నిలవాల్సిన సీజన్ 8.. యావరేజ్‌గా నిలవడానికి కారణం కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫైటింగ్స్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఒక్క అంశం టిఆర్పి రేటింగ్ పై ప్రభావం చూపించింది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ 9 లో అపాయింట్ వర్కౌట్ కావడం లేదని భావించిన టీం.. హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ తో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 6 టఫ్ కంటెస్టెంట్లను పంపించాలని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు.. ఆ ఆరుగురు హౌస్ మేట్స్ ఎవరు అనే డీటెయిల్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వాళ్లలో మొదటి కంటెంట్ అయేషా. టాప్ సీరియల్ హీరోయిన్ గతేడాది స్టార్ మా చానల్లో బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్ తో ఊర్వశివ రాక్షసివో సీరియల్ లో నటించింది. ఈ అమ్మడు తమిళ్ బిగ్ బాస్ లో నెలరోజులపాటు రాణించింది. గొడవలు పడడంలో దిట్ట.. అబ్బాయిలతో సమానంగా గేమ్స్ ఆడగలదు.. అంతే కాదు హౌస్ లో మసాలా యాడ్ చేస్తూ భారీ కాంట్రవర్సీలను కూడా సృష్టిస్తుందని ఈమెను హౌస్ లోకి పంపించనున్నాడట.
2వ కంటిస్టెంట్ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య.. హౌస్ లోకి ఏంట్రీ ఇవ్వనుందట. ఈ అమ్మడుకు నెటిజన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గతేడాది కాంట్రవర్సీతో నెగిటివ్ కామెంట్లతో తెగ వైరల్ గా మారిన ఈ అమ్ముడు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా హౌస్ హీట్ ఎక్కుతుందని టీం భావిస్తున్నారట. ఇక మూడో కంటెంట్ గా దివ్వెల మాదిరిని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక నాలుగో కంటెస్టెంట్ గా నిఖిల్ నాయర్.. ఇప్పటికే స్టార్ మా ఛానల్లో పలు సీరియల్స్ లో హీరోగా మెరిసాడు. గృహలక్ష్మి, పలికే బంగారం అనే సీరియల్స్‌లో ఆకట్టుకున్నాడు. ఆయనా బిగ్ బాస్ హౌస్‌లో నాలుగో కంటిస్టెంట్గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇక మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లుగా సాయి శ్రీనివాస్, గౌరవ్ గుప్త. గోల్కొండ హై స్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఇద్దరు.. ఇప్పటికి పలు సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. అంతేకాదు.. గౌరవ్ గుప్త స్టార్ మా చానల్లో గీత ఎల్.ఎల్.బి సీరియల్ హీరోగాను మెరిశారు. ఈ క్రమంలోనే.. మరి కొద్ది గంటల్లో ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ టీం హీట్ ఎక్కబోతుందని అంటున్నారు. మరి వీళ్ళ ఎంట్రీ హౌస్ లో ఏ రేంజ్ లో ఫైర్ స్ట్రామ్ సృష్టిస్తుందో చూడాలి.