గ్రాండ్ లెవెల్ లో ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ మ్యారేజ్.. పెళ్లికూతురు బ్యాగ్రౌండ్ తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది.. లక్ష్మీ ప్రణీత్ సోదరుడు.. హీరో నార్ని నితిన్ పెళ్లి కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్ లో జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివారులో సంకరపల్లిలో ఫ్యామిలీ, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు నితిన్‌. తాళ్లూరి కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతులకు కుమార్తె లక్ష్మి శివానితో ఆయన ఏడు అడుగులు వేశాడు. ఈ పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి తో పాటు.. కుమారులు అభయ్ రామ్. భార్గవ్ రామ్ సందడి చేశారు.

Image

పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక పెళ్లికి హాజరైన ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలను.. అతిథులను దగ్గరుండి ఆహ్వానిస్తూ తమ చేతులపై వివాహాన్ని ఎన్టీఆర్ వైభవంగా జరిపారు. అంతేకాదు.. కొత్త దంపతులను ఆశీర్వదించారు. నితిన్, శివాని.. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణ‌తిల‌ కాళ్లకు నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇంతకీ అసలు ఈ శివాని ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

Venkatesh With Wife Visuals @ Narne Nithiin & Shivani Engagement Function | Manastars

సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలు పెట్టేసారు. ఆమె పేరు తాళ్లూరి శివాని. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ అమ్మడు.. తాళ్లూరు వెంకటప్రసాద్, స్వరూప దంపతులకు కుమార్తె. ఇక ఆమె తండ్రికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉందని సమాచారం. అంతేకాదు.. హీరో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీతో తాళ్లూరి కృష్ణ ప్రసాద్ కుటుంబానికి చాలా దగ్గర బంధుత్వం ఉందట. సినీ, రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం వెంకటేష్ కజిన్ డాటర్ శివాని అంటూ టాక్‌ నడుస్తుంది. అంతేకాదు.. తండ్రి కృష్ణ ప్రసాద్, తల్లి స్వరూపలు ప్ర‌ముఖ ఇండస్ట్రియలిస్ట్‌లుగా రాణిస్తున్నారు.