జాక్పాట్ కొట్టేసిన శ్రీ లీల.. ఆ స్టార్ హీరోతో రెండు సినిమాల్లో ఛాన్స్..!

కోలీవుడ్ క్రేజీ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో.. అమరాన్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. చివరిగా మదరాసి సినిమాతో కమర్షియల్ సక్సెస్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌జెంట్ సుథ కొంగ‌రా డైరెక్షన్‌లో పరాశక్తి సినిమా సెట్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇది శివకార్తికేయన్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం. నటుడు రవి మోహన్ విల‌న్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో అదర్వా కీలక పాత్రలో మెరవనున్నారు.

Here's the ensemble that will set the screen on fire in #Parasakthi 🔥🎥  பராசக்தி(தீ) பரவ ஆரம்பித்தது… ✊🏻🔥 @sivakarthikeyan @sudha_kongara  @jayamravi_official @atharvaamurali @gvprakash @aakash_baskaran  @sreeleela14 @dop007 ...

ఇక.. ఈ సినిమాతో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల కు కోలీవుడ్ ఎంట్రీ కి లైన్ క్లియర్ అయింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాతో అమ్మడు త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమా షూట్ తుది ద‌శ‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు తర్వాత వెంటనే శిబి చక్రవర్తి డైరెక్షన్లో శివ కార్తికేయన్ మరో సినిమాలో నటించనున్నాడట. గతంలోనే.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో డాన్ లాంటి సూపర్ హిట్ సినిమా తెర‌కెక్కింది. ఈ క్రమంలోనే.. మరోసారి వీళ్ళ కాంబో రిపీట్ అవుతుండడంతో.. అక్కడ ఆడియన్స్‌లోను మంచి అంచనాలు మొదలయ్యాయి.

Sivakarthikeyan & Sreeleela Dancing For Kurchi Madathapetti Song 🔥-  Dhanalakshmi Srinivasan College

నవంబర్ నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందట. ఇక.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్‌ వ్యవహరిస్తుండగా.. శ్రీ లీల మరోసారి శివ కార్తికేయ‌న్‌తో జతక‌ట్ట‌నుందని టాక్‌ నడుస్తుంది. అయితే.. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే శ్రీ లీల.. బ్యాక్ టు బ్యాక్ శివకార్తికేయన్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.