కాంతర చాప్టర్ 1 కలెక్షన్ల సునామి.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తానే హీరోగా తెర‌కెక్కిన‌ లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1.. ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్న ఈ సినిమా.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. అక్టోబర్ 2 దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో.. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా మెరవగా.. గుల్షన్ దేవ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.

Kantara Chapter 1 Box Office Collection Day 9: Kantara Fever Continues As  Rishab Shetty's Kannada Movie Is Unstoppable At Ticket Windows

2022లో రిలీజ్ అయిన కాంతారకు ఫ్రీక్వల్గా వచ్చిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లో రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసి రికార్డు సృష్టించింది. అయితే.. తాజాగా ఈ సినిమా మరో రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రూ.500 కోట్ల టార్గెట్‌ను కూడా బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.509 కోట్లు సాధించినట్లు వివరించారు. కాగా.. ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా 2025 కలెక్షన్లు కొల్లగొట్టిన రెండో సినిమాకి రికార్డును క్రియేట్ చేసింది. త్వరలోనే సినిమా మొదటి స్థానానికి వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Kantara Chapter 1 Box Office Week 1: Rishab Shetty starrer becomes second  biggest Kannada film worldwide - Entertainment News | The Financial Express

ఈ ఏడాది రిలీజై హ‌యెస్ట్‌ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రష్మిక మందన ఛావా రికార్డు క్రియేట్ చేసింది. ఫుల్ రన్ లో రూ.600 కోట్ల కలెక్షన్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అయితే.. ఈ సినిమా రికార్డును కాంతార 1 బ్రేక్ చేస్తుందని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డ్‌లతో సినిమా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తొమ్మిది రోజుల్లో రూ.509 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమాకు.. మరో వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ముందు ముందు ఈ సినిమా మరెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.