టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు వినగానే కేవలం తెలుగు ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్ష్ మొదలైపోతాయి. భారతీయ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎదగడానికి మెయిన్ పిల్లర్ రాజమౌళి అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్స్.. చాలా రేర్‌గా కనిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు.. తెలుగు సినిమా కేవలం లోకల్ మార్కెట్‌కు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ.. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీ గ్లోబల్ ప్లాట్ఫామ్ పై దూసుకుపోతుందంటే.. దానికి ప్రధాన కారణం రాజమౌళి.
ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా.. టాలీవుడ్ హిస్టరీలో మైల్డ్ స్టోన్ గా మిగిలిపోయింది. ఇక రాజమౌళి విజన్ ఏంటో.. ఆయన కష్టం, పర్ఫెక్షన్.. ప్రతి సినిమాలోను ఆడియన్స్ కు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కేవలం సినిమా కోసం ఆయన కష్టపడడమే కాదు.. సినిమాలో పనిచేసే నటీనటులను సైతం అదే విధంగా కష్టపడుతూ ఉంటాడు. ఈ కష్టం సినిమా సక్సెస్‌కు బాటలు వేస్తుంది. కాగా.. నేడు రాజమౌళి బర్త్డే కావడంతో.. సోషల్ మీడియాలో ట్వీట్‌లు, విషెస్ వెలువెత్తుతున్నాయి. ఆయనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు సైతం వైరల్ గా మారుతున్నాయి.
ముఖ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ అంశం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అదే.. రాజమౌళి దర్శకుడు కాకపోయి ఉంటే ఏ ఫీల్డ్ ఎంచుకుంటాడు అనే ప్రశ్న. గతంలో.. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను డైరెక్ట్ గా సెట్ కాకపోయి ఉంటే.. కచ్చితంగా లెక్చరర్‌గా మారేవాడినంటూ చెప్పుకొచ్చాడు. ఆయనకు టీచింగ్ అంటే చాలా ఇష్టమని.. ఏ విషయమైనా ఇతరులకు అర్థమయ్యేలా వివరించడం.. సినిమాటిక్‌గా చెప్పడం.. నాకున్న న్యాచురల్ స్కిల్ అంటూ వివరించాడు. లెక్చరర్‌గా ఉద్యోగం.. తనకు బాగా సరిపోతుందంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే రాజమౌళి కామెంట్స్ మరోసారి వైరల్‌గా మారుతున్నాయి.