కల్కి వివాదాలపై రియాక్ట్ అయిన దీపికా.. నన్నే ఎందుకు టార్గెట్ చూస్తున్నారంటూ..

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే దీన్ని సీక్వెల్ కల్కి 2 కూడా.. సెట్స్ పైకి రానుందని.. ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు.. ఈ సినిమా నుంచి మెయిన్ లీడ్ దీపిక పదుకొనేను తొలగించినట్లు వివరించారు. దీనిపై నెటింట హాట్‌ టాపిక్‌గా చర్చలు కొనసాగాయి. కేవలం డేట్ సమస్యలే కాదు.. రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేయడం కారణం అంటూ సమాచారం.

Deepika Padukone receives love as she plays a mother in Kalki 2898 AD |  Filmfare.com

దానికి తగ్గట్లుగానే ప్రతిరోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటానని.. నాతో పాటు 25 మంది సిబ్బంది కూడా ఉంటారు.. అందరి కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలని.. ఆమె డిమాండ్ చేసిందట. ఈ కారణంగానే వైజయంతి మూవీస్ కల్కి 2 నుంచి ఆమెను తప్పించినట్లు టీం వెల్లడించారు. దీంతో.. దీపిక పై నెగటివ్ కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే.. తాజాగా స్పిరిట్, కల్కి సీక్వెల్‌ విషయంలో తనను తొలగించడం పై దీపిక రియాక్ట్ అయింది. ఎంతో మంది మెయిల్ సూపర్ స్టార్ కేవలం 8 గంటల షూట్లో మాత్రమే పనిచేస్తున్నారు..

వీకెండ్స్ లో అసలు షూట్స్ లోనే పాల్గొనరు.. అలాంటి వారి గురించి ఏమీ మాట్లాడరు.. ఇటీవల కాలంలో చాలా మంది బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్లు.. 8 గంటలు పని చేయడం మొదలుపెట్టారు. కానీ.. ఎందుకు అంత నన్నే టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఫైర్ అయింది. ఇప్పటికైనా.. నాపై వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను ఆపేయండి అంటూ.. దీపిక డిమాండ్ చేసింది. ప్రస్తుతం దీనిక కామెంట్స్ వైత‌ల్‌గా మారుతున్నాయి.