కాంతార చాప్టర్ 1 నయా సెన్సేషన్.. ఆ లిస్టులో 2వ మూవీగా రికార్డ్..!

కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్‌లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. కాంతారకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా.. తాజాగా రూ.400 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం విశేషం.

Sakthivel - Buzz: Kantara Chapter 1 movie 6 days WW collections upto ₹428  Cr #cinema 🎥🍿👏💥 | Facebook

సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల‌గొట్ట‌డం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటికే.. ప్రపంచ వ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఆరు రోజుల్లోనే ఈ రేంజ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల లిస్టులో రెండవ‌ స్థానాన్ని ద‌క్కించుకుంది. కేజీఎఫ్ 2 సినిమా కన్నడ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొదటి సినిమాగా నిలవగా.. కంతారా చాప్టర్ 1 రెండవ‌ స్థానాన్ని దక్కించుకుంది.

Prime Video: K.G.F Chapter 2 (Malayalam)

2022లో రిలీజ్ అయిన కాంతర ఫుల్ రన్ లో రూ.408 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టగా.. య‌ష్ హీరోగా నటించిన కేజిఎఫ్ 2 .. రూ.1215 కోట్ల వసూళ్లు దక్కించుకుని మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 జోరు చూస్తుంటే.. వారం రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ ట‌చ్‌ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫుల్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.. ఏ రేంజ్ లో కలెక్షన్లు కొలగొడుతుందో చూడాలి.