పవన్ ఓజీ సెన్సేషనల్ రికార్డ్.. ఆ లిస్ట్ లో 6వ స్థానం..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు.. 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఖాతాలో హిట్ పడింది. ఈ క్రమంలోనే.. పవన్ ఫ్యాన్స్ స‌క్స‌స్ సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినిమా మొత్తం పవన్ ను ఎలివేట్ చేసిన తీరు నెక్స్ట్ లెవెల్ ఆకట్టుకుందని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఇక అభిమానులు పవన్‌ను చూసి సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అవడంతో.. ఆయన కూడా దాన్ని ఎంజాయ్ చేశారు. ఓజీ యూనివర్స్‌లో న‌టించ‌డానికి సైతం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సుజిత్ కథ ఎంత స్ట్రాంగ్ గా రాస్తాడు చూడాల్సి ఉంది.

అయితే.. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పటికే రూ.350 కోట్ల దాటేసింది. సినిమాకు పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ఆడియన్స్‌ సైతం క్యూ కట్టారు. ఈ క్రమంలోనే భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ అందించిన సినిమా అయినా.. ఈ రేంజ్ లో కలెక్షన్ రావడం అంటే సాధారణ విషయం కాదు. చాలా వరకు పాన్‌ సినిమాలుగా యూ \ఏ సర్టిఫికెట్‌తో రిలీజ్ అయిన సినిమాలు సైతం రూ.300 కోట్లు కాదు కదా కనీసం రూ.250 కోట్లు కూడా దాటని సినిమాలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడు.. ఏ సర్టిఫికెట్ తో ఆ సినిమాల రికార్డును చిత్త చేసి రూ. 300 కోట్లు కలెక్షన్లు దాటి చూపించింది ప‌వ‌న్‌. కాగా.. ఇప్పటివరకు ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ అయి రూ.300 కోట్ల గ్రాఫ్ కలెక్ట్ చేసిన సినిమాలు చాలా రేర్. వాటిలో ఓజీ 6వ‌ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా కంటే ముందు కేవ‌లం ఐదు సినిమాలు రూ.300 కోట్లకు గ్రాస్ ను కొల్లగొట్టాయి. ఈ క్రమంలోనే పవని క్రేజీ రికార్డ్ వైరల్ గా మారుతుంది. ఫ్యాన్స్ అయితే తెగ మురిసిపోతున్నారు. పవన్ అసలు సిస‌లు స్టామినా ఓజీతో రివీల్ అయిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.