ద బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్ బాస్‌కు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. భాష ఏదైనా సరే.. ప్రతి ఇండస్ట్రీలోనూ బిగ్ బాస్ రియాల్టీ షోను ఆడియన్స్ భారీ లెవెల్లో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్లపై సీజన్లు చేస్తూ.. మేకర్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. కన్నడ బిగ్‌బాస్‌కు భారీ షాక్ తగిలినట్లు అయింది. అసలు షో హిస్టరీలో ఇప్పటివరకు లేని ఓ పరిణామం చోటుచేసుకుంది. పర్యావరణ నిబంధనలను బిగ్ బాస్ టీం ఉల్లంగించారని.. అధికారులు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ గంగలో తొక్కి.. తమకు నచ్చినట్లు చేసుకుంటున్నారని ఆరోపణలపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బిగ్ బాస్ పై సీరియస్ యాక్షన్ తీసుకుంది. రియాలిటీ షో కొనసాగుతున్న క్రమంలోనే.. పోలీసులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
కర్ణాటకలోని బాలీవుడ్ స్టూడియోలో గందరగోళం నెలకొంది. కంటెస్టెంట్లు హౌస్ లో ఉండగానే బిగ్ బాస్ గేట్లు బద్దలు కొట్టి మరి పోలీసులు లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే పరిస్థితి గమనించిన బిగ్ బాస్ టీం.. కంటెస్టెంట్లను హుటాహుట్టిన ఓ రిసార్ట్ కు తరలించారు. ఈ సంఘటన ద్వారా అన్మోల్ షైన్ నిర్వాహకులకు కోట్లల్లో నష్టం వాటిల్లిందని సమాచారం. బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ ఇటీవల గ్రాండ్‌గా మొదలైంది. హోస్ట్‌గా సందీప్ కిచ్చా షోను రికార్డు లెవెల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేశాడు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. జూలీ స్టూడియోస్ అట్టహాసంగా ఏర్పాటు చేసిన రియాలిటీ షో పర్యావరణ నిబంధనలను ఉల్లగించారని దీనిపై హెచ్చరించిన.. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిన టీం దీన్ని అసలు పట్టించుకోలేదని..
ఈ విషయంలోనే చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు అని కర్ణాటక అడవి శాఖ పర్యావరణం వనరుల శాఖ మంత్రి ఈశ్వర్ ఖాద్ర ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. జూలీ స్టూడియో బిగ్ బాస్ నిర్వాహకులకు రెండుసార్లు నోటీసులు జారీ చేసిన పట్టించుకోకపోడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసులు రంగ ప్రవేశం చేసి.. స్టూడియోను సీజ్ చేసేసారు. ఇలా.. అద్దాంతరంగా షోను ఆపేయడంతో నిర్వాహకులకు కోట్లలో నష్టం నెలకొంది. అసలు ముందు ముందు షోకొనసాగుతుందో.. లేదో.. మరోచోట నిర్వహిస్తారా అనే విషయం పై సందేహాలు మొదలయ్యాయి. కాగా ఈ హౌస్ సెట్ నిర్మించడానికి బిగ్ బాస్ టీంకు రూ.5 కోట్ల వరకు ఖర్చు జరిగినట్లు సమాచారం. అయితే.. మరోచోట పర్యావరణ అనుమతులు తీసుకొని ఇలాంటి సెట్స్ వేస్తారా.. లేదా.. మరేమైనా ప్రత్యామ్న్యాయ మార్గాలు వెతుకుతారా.. అసలు షోనే ఆపేస్తారా చూడాలి.