టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవమన్మధుడుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నాగార్జున.. కేవలం రొమాంటిక్ సినిమాల్లోనే కాదు మాస్, క్లాస్ సినిమాలతో పాటు.. డివోషనల్ సినిమాలోను నటించి ఆకట్టుకున్నాడు. దాదాపు అన్ని జోనార్ల లోను మెప్పించచిన నాగ్.. ఇటీవల కాలంలో హీరో గానే కాకుండా.. విలన్ గాను తన సత్తా చాటుకుంటున్న సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో హీరోగా 99 సినిమాల్లో నటించిన నాగార్జున.. వందవ సినిమా విషయంలో మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నాగ్ వందవ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇక కింగ్ 100 సినిమా.. తమిళ్ డైరెక్టర్ ఆర్య కార్తీక్ దర్శకత్వంలో రూపొందనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తాన్నే ప్రొడ్యూసర్‌గా నాగార్జున సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల సీక్రెట్ గా ప్రారంభించేశారట మేకర్స్. తొలి షెడ్యూల్లో నాగార్జున సందడి చేసినట్లు తెలుస్తోంది.
సినిమాకు కింగ్ 100 లేదా కింగ్ 100 నాట్ అవుట్ అనే టైటిల్ మేకర్స్ ఫిక్స్ అయ్యారంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయితే.. తాజాగా ఈ టైటిల్స్ ఏవి కాదు లాటరీ కింగ్ టైటిల్ సినిమాకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఈ సినిమాలో మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే.. నాగార్జున సరసన ఒకరు కాదు.. ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారట. డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కామియో రోల్‌లో మెరిసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. అయితే వీటిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.