కాంతర కథ పుట్టుకకు ఆ ఘర్షణే కారణం.. రిషబ్ శెట్టి..!

రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. ఇటీవల ఆడియ‌న్స్‌ను పలకరించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు రిషబ్ శెట్టి. ఇందులో భాగంగా రిష‌బ్‌ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం తన విలేజ్‌లో జరిగిన ఓ క్లాష్ కారణంగానే కాంతర కథ పుట్టింది అంటూ వివరించాడు. అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారని.. తను కేవలం ఆ స‌న్నివేశాల‌కు విజువల్స్ మాత్రమే ఊహించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

తన వెనుక ఏదో శక్తి ఉండి వాటన్నింటినీ రాయించిందని.. నమ్ముతున్నా అంటూ చెప్పుకోచ్చాడు. ప్రేక్షకులు ఈ సినిమా ఆదరిస్తారని తీసే టైం లో నాకు అనిపించింది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇలాంటివి ఎప్పుడూ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటాయని నా నమ్మకం. మరోసారి ఆ నమ్మకం నిజమైంది. ఆలోచింపజేసే విషయం కథలో ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా సినిమా గురించే చెప్పుకుంటారు. మన కంటెంట్ సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా ఉండాలి.

Kantara Chapter 1 Movie Box Office Collections: Rishab Shetty's Kantara 2  Mints Rs 60 Crore At Box office | Regional Cinema News - News18

అలా తీయలేకపోతే.. అది ఒక ప్రాంతానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది అంటూ వివరించాడు. ఇంతకీ ఆ 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘర్షణ ఏంటంటే.. వ్యవసాయ భూమి కోసం అడవి అధికారికి, రైతుకు మధ్య జరిగిన వివాదం. దానిలో నేను ఇద్దరు మనుషుల మధ్య ఘర్షణగా చూడలేదు. ప్రకృతిని కాపాడే వాళ్ళ మధ్య ఘర్షణగా ఫీలయ్యా. ఈ అంశంతో కథ రాయాలని ఫిక్స్ అయిపోయా. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం మొదలు పెట్టా అంటూ వివరించాడు రిషిబ్‌. ఆ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.