కాంతార చాప్టర్ 1 నయా సెన్సేషన్.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. తానే దర్శకుడుగా, హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. భారీ అంచ‌నాల‌ నడుమ.. దసరా కానుకగా అక్టోబర్ 2 న రిలీజ్ అయిన ఈ మూవీ.. ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్స్ ముగించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్‌ను దక్కించుకోవడంతో.. హైయెస్ట్ కలెక్షన్లతో 2025 లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఈ సినిమాను డివైన్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రేక్షకులు తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Kantara: Chapter 1 makers celebrate World Environment Day with a new poster  and a message, writes "Let's protect the forests that protect us"

ఈ క్రమంలోనే కలెక్షన్స్ ఈ రెండు రోజుల్లో మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇక.. ఈ సినిమా ఫస్ట్ డే.. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమా 2025 హైమ‌స్ట్‌ ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమాల లిస్టులో మొదటి వరుసలో ఉంటుంది. అంతేకాదు.. కేవలం ఒక్క బుక్ మై షో లో సినిమా 1.28 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయినట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

దీన్ని బట్టి.. సినిమాకు ఏ రేంజ్‌లో హైప్ క్రియేట్‌ అయిందో.. ఆడియన్స్ ఏ రేంజ్‌లో సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు అర్థం చేసుకోవచ్చు. బుక్ మై షో కాకుండా.. ఇతర యాప్స్ తో పాటు.. ఆఫ్ లైన్ బుకింగ్స్ కూడా కలుపుకుంటే ఫస్ట్ డే సెన్సేషన్ కలెక్షన్లు రికార్డ్‌ అవ్వడం కాయం. ఇక.. రెండవ రోజు కూడా సినిమాకు గంటకి 70 వేల టికెట్లు షోల్డ్ అవుట్ అవ్వడం విశేషం. రిషబ్ శెట్టి యాక్టింగ్ పై సినిమాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. కథను నడిపించిన తీరుతో పాటు.. రిషబ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.