సినీ ఇండస్ట్రీలో శాటిలైట్ మార్కెటింగ్‌కు ఉన్న క్రేజ్, ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమాలో థియేటర్‌లోనే చూడాలి. లేదంటే కొద్ది నెలల తర్వాత టీవీ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేవరకు ఎలాంటి అవకాశం ఉండేది కాదు. ఈ క్రమంలోనే టీవీలో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు కచ్చితంగా టీ ఆర్‌పి సెన్సేషన్ సృష్టించేది. ఈ క్రమంలోనే నిర్మాతలు సైతం సినిమాకు పెట్టిన బడ్జెట్ను భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్ ద్వారా వసూళ్లు చేసేవారు. ఈ క్రమంలోనే.. బడా టీవీ ఛానళ్లు సైతం స్టార్ హీరోల సినిమాల రిలీజ్‌కు ఎదురు చూసేవాళ్ళు. శాటిలైట్ హక్కులు తామే దక్కించుకోవాలని కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు. ఈ క్రమంలోనే దాదాపు 20 ఏళ్ల పాటు శాటిలైట్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్లకు భారీ ఆదాయం వనరుగా నిలిచింది.
కానీ.. తాజాగా డిజిటల్ యుగం మొదలైపోయింది. శాటిలైట్ మార్కెట్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కరోనా టైంలో ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫారంలో పలు సినిమాలను రిలీజ్ చేసేవారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు జనాలు అలవాటు పడిపోయారు. థియేటర్‌లో రిలీజ్ అయిన కొన్ని వారాల్లోనే సినిమాలు ఓటీటీల్లో ప్రసారమవుతుండడంతో.. టీవీలో సినిమా స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే శాటిలైట్ మార్కెటింగ్‌కు డిమాండ్ బాగా తగ్గిపోయింది. టీవీలో వస్తేనే సినిమా చూద్దామని జనం ఆలోచించడం మానేశారు. ఎప్పుడు సినిమా చూస్తామా.. ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఆత్రుత ప్రేక్షకుల్లో మొదలైపోయింది. ఈ క్రమంలోనే థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూడడం కుదరని ప్రేక్షకులంతా ఇంట్లోనే ఓటీటీలా సబ్స్రిప్షన్‌తో దాదాపు అన్ని సినిమాలను చూసేస్తున్నారు.
దీంతో.. టీవీ ఛానల్ సైతం కోట్లు ఖర్చుపెట్టి శాటిలైట్ హక్కులను కొనడానికి వెనుకడుగు వేస్తున్నాయి. ఒకప్పుడు ఎన్ని కోట్లు అయినా పర్వాలేదు.. తమ ఛానల్ లోనే సినిమా రిలీజ్ అవ్వాలని ఆలోచించే చానల్స్ అన్ని.. ఇప్పుడు తక్కువ ధర కైనా సరే కొనుక్కోవడానికి ఆలోచిస్తున్న పరిస్థితి. చాలా వరకు.. సక్సెస్ కానీ సినిమాలన్నీ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాయి. కేవలం చిన్న సినిమాలు కాదు.. స్టార్ హీరోల సినిమాలకు సైతం ఇలాంటి పరిస్థితి నెలకొంది. బడా స్టార్ హీరోల సినిమాల విషయంలోనూ శాటిలైట్ హక్కులను దక్కించుకోవడానికి చానల్లో ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి ఒక్క చానల్స్ విషయంలోనూ ఇదే సీన్. వాస్తవానికి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోక నిర్మాతలు సైతం సతమతమయ్యే పరిస్థితి. చిన్నచిన్న మేకర్స్ అయితే బడ్జెట్ మేనేజ్ చేయలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా.. మొత్తానికి ఒకప్పుడు ఇండస్ట్రీకి భారీ ఆదాయ వనరుగా మిగిలిన శాటిలైట్ మార్కెటింగ్ తాజాగా వచ్చిన డిజిటల్ మార్కెటింగ్ కారణంగా కుదేలు అయిపోతుంది. దాదాపు చివరి దశకు చేరుకుంది.