అక్కినేని కోడలు శోభితా దూళిపాళ్ల పేరు ప్రజెంట్ తెగ వైరల్ గా మారుతుంది. ఇటీవల నాగచైతన్య, శోభిత కపుల్ హైదరాబాద్‌లో షాపింగ్ మాల్ గ్రాండ్ లెవెల్లో ఓపెన్ చేసారు. అంతేకాదు.. పెళ్లి తర్వాత మొదటిసారి వీళ్ళిద్దరూ కలిసి క్రౌడ్ ఉండే ఇలాంటి ఈవెంట్‌కు బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ లైఫ్‌కు ఫిక్స్ సినిమాలకు దూరమైపోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కు.. తాజాగా పండగ నాడు శోభిత గుడ్ న్యూస్ చెప్పింది.
పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ అని వార్తలకు చెక్ పెడుతూ.. తాజాగా తమిళ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వివరించింది. ఇక గత కొంతకాలంగా అమ్మడు మ్యారేజ్ లైఫ్ మాత్రమే లీడ్ చేస్తుందని.. సినిమాలకు దూరమైపోయింది అని..అడపాదడపా ఫంక్షన్లలో కనిపించినా.. ప్రాజెక్టులపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని.. శోభిత ప్రజెంట్ ప్రెగ్నెంట్ అంటూ రకరకాల వార్తలు తెగ వైరల్‌గా మారాయి.
ఇలాంటి క్రమంలో.. శోభిత ఫ్యాన్స్‌కు మంచి ట్విస్ట్ ఇచ్చింది. విలక్షణ స్టార్ డైరెక్టర్ తమిళ్ పా. రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాల్లో ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయింది. సినిమాలో హీరోగా దినేష్ నటిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు ఆర్య కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే శోభిత అఫీషియల్ ప్రకటనతో ఫ్యాన్స్ లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. దసరా పండగ ముందు అక్కినేని ఫ్యాన్స్ కు అక్కినేని కోడలు చెప్పిన గుడ్ న్యూస్ అదిరిపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.