కాంతార 1: కాంట్రవర్సీలకు చెక్ పెట్టిన రిషబ్ శెట్టి..!

గత రెండు మూడు రోజులకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నా న్యూస్ రిషబ్‌శెట్టి కన్నడ మాట్లాడడం. ఈ వివాదం ఎంత పెద్ద దుమారంగా మారిందో తెలిసిందే. హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగు ఆడియన్స్‌ కోసం స్పీచ్ ఇచ్చిన రిష‌బ్‌.. కన్నడలో మాట్లాడడం.. తెలుగు ప్రేక్షకుల కోపానికి కారణమైంది. ఈ క్రమంలోనే అంతో ఇంతో తెలుగు వచ్చిన అసలు.. తెలుగే రానివాడికి లాగా.. కన్నడలో స్పీచ్ ఇవ్వడమేంటి అంటూ మండిపడుతున్నారు నేటిజన్స్. కొంతమంది ఏకంగా బాయికాట్ కాంతారా చాప్టర్ 1 నినాదాన్ని వైరల్ చేస్తున్నారు. ఇదంతా రిషబ్ శెట్టి వరకు చేరింది.

Rishab Shetty Superb Speech at Kantara Chapter 1 Pre Release Event in Vijayawada - YouTube

ఈ క్రమంలోనే.. తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ వివాదానికి చెక్ పెట్టేసాడు రిష‌బ్‌. తెలుగు, కన్నడ భాషలు సోదరులాంటివని.. ఒక కన్నడియుడు ఎప్పుడూ.. ఇతర భాషలను కచ్చితంగా ప్రేమిస్తాడు. తనకు ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కేవలం తెలుగుపై పట్టు లేకపోవడం వల్లే పొరపాట్లు జరుగుతున్నాయి అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. జై హనుమాన్ లో నటించే సమయంలో తెలుగుని ఇంకా బాగా నేర్చుకుంటానని.. నిర్మాత మైత్రి రవిని ఉద్దేశించి మాట్లాడాడు. దీంతో ఈవెంట్ చప్పట్లతో మారుమోగింది.

Kantara Chapter 1 sells digital rights for Rs 125 cr; Know when the trailer is releasing - Entertainment News | The Financial Express

ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబునాయుడులకు సభ వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రిషబ్ క్లుప్తంగా మాట్లాడడం విశేషం. కన్నడలో అయితే ఎక్కువ సేపు విశేషాలు పంచుకోవడానికి అవకాశం ఉండేది. కానీ మళ్ళీ నెగెటివిటీ మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే రిషబ్ పై సోషల్ మీడియా ప్రభావం.. అందులో జరిగిన ట్రోలింగ్ ఏ రేంజ్ లో పడిందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్లకు పర్మిషన్లు కూడా తెచ్చుకుంది. ఈరోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆలస్యంగా మొదలుపెట్టిన మేకర్స్‌ సినిమా విషయంలో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటారో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.