ఆ రోజు నైట్ నేను వేణుమాధవ్ రూమ్ లోనే పడుకున్నా.. షకీలా షాకింగ్ సీక్రెట్ రివీల్..!

టాలీవుడ్ దివంగ‌త స్టార్ కమెడియన్ వేణుమాధవ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన జెన్యూన్ స్టైల్ కామెడీతో ఎంతో మంది ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన.. తన చివరి రోజుల వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే.. 2019లో అనారోగ్య కారణాలతో వేణు మాధవ్ చిన్న వయసులోనే మరణించారు. ఇక వేణుమాధవ్ కామెడీ పరంగానే కాదు.. బయట కూడా ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటూ ఇతరులకు హెల్ప్ ఫుల్ గా ఉండేవాడట. ఇప్పటికే ఆయనతో పనిచేసిన చాలామంది నటీనట్లు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఇక బోల్గ్‌ సినిమాలకు క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన షకీలా సైతం వేణుమాధవ్ కాంబినేషన్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

Venu Madhav is No More

ఈ క్రమంలోనే.. అతనితో ఉన్న బాండింగ్ గురించి, హెల్పింగ్ నేచర్ గురించి షేర్ చేసుకుంది. సినిమా షూట్‌లో భాగంగా.. వీళ్ళు అవుట్‌డోర్ షూట్‌కి వెళ్ళామని.. నాకు ఇచ్చిన రూమ్ అసలు కంఫర్ట్ గా అనిపించకపోవడంతో వేణుమాధవ్ దగ్గరకు వెళ్లి.. నా రూమ్ అసలు కంఫర్ట్ లేదు. ఈ రోజుకు నేను నీ రూమ్‌లో పడుకోవచ్చా అని అడిగానని.. వెంటనే వేణుమాధవ్ పడుకోండి అని చెప్పేసారని వివరించింది. సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ లోను మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందంటూ చెప్పుకొచ్చిన ఆమె.. ఆ ధైర్యంతోనే నేను ఆ నైట్ వేణుమాధవ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నానని వివ‌రించింది. బెడ్ పై పడుకొని ఏదో ఆలోచిస్తున్న‌ టైంలో.. వేణుమాధవ్ లేచి ఏదో పని చేస్తున్నారని నాకు ఒక షాడో కనిపించంది. వెంటనే లేచి ఏం చేస్తున్నావ్ వేణు అని అడిగానని.. నేను ఒకటి అడుగుతాను నువ్వేం అనుకోవు కదా అని అన్నాడంటూ వివరించింది.

షకీలా రాత్రి పడుకోవడానికి వేణు మాధవ్‌ రూమ్‌కి వెళితే, ఆయన చేసిన పనికి నిద్ర  లేని రాత్రి | Shakeela Reveals Comedian Venu Madhav Reality What He Did At  Night In Telugu | Asianet ...

ఏమనుకోనని చెప్పినా మనసులో మాత్రం కాస్త భయం ఉంది.. ఏం అడుగుతాడు అని చిన్న టెన్షన్ ఉంది. మొత్తానికి వేణుమాధవ్ బెడ్ మధ్యలో పిలోస్ పెడుతున్నాడు. అదంతా చూసిన నేను.. ఇదంతా దేనికి అని అడిగాను అంటూ చెప్పుకొచ్చింది షకీలా. దీంతో వేణుమాధవ్ నాకు ఫ్యామిలీ ఉంది.. పిల్లలు ఉన్నారు.. పొరపాటున రాత్రిపూట నీ చెయ్యి కానీ నా మీద పడితే నా బతుకు అంతే.. దెబ్బకు నా ప్రాణం పోయినా పోతుంది అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడని.. దాంతో నేను నైట్ అంతా నవ్వుకుంటూనే ఉండిపోయా.. అలా వేణుమాధవ్ చాలా కామెడీగా అందరిని నవ్విస్తూ ఉంటాడని.. షకీలా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది.