హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాలీవుడ్ టాప్ ట్రైలర్స్ లిస్ట్ ఇదే..!

స్టార్ హీరోల పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే కిక్ నెట్ లెవెల్ లో ఉంటుంది. పోస్టర్ నుంచి సినిమా ట్రైలర్ వరకు ప్రతి ఒక్క అప్డేట్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయితే విధ్వంసం నెక్స్ట్ లెవెల్. ట్రైలర్ అప్డేట్స్ వ‌స్తే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ రేపి తెగ ట్రెండ్‌ చేసేస్తారు ఫ్యాన్స్. అలా ఇప్పటివరకు.. టాలీవుడ్‌లో రిలీజ్ అయినా టీజర్, ట్రైలర్‌ల‌తో హైయెస్ట్ వ్యూస్‌ సాధించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్‌ టీజర్ ప్రస్తుతం తెలుగులో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్, ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్ 2002 జులై 6న రిలీజై ఇప్పటికి 14 కోట్ల 96 లక్షల 24 వేల వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు.. 25 లక్షల లైక్స్ రావడం విశేషం. సలార్‌ తర్వాత.. రెండవ స్థానాని ఐకన్ సార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన పుష్ప 2 ట్రైలర్ దక్కించుకుంది. ఈ ట్రైలర్ 2024 ఏప్రిల్ 8న రిలీజ్ అయింది. ఇక ఇప్పటివరకు ఈ టీజర్ కి 12 కోట్ల 46 లక్షల 86 వేల వ్యూస్‌.. అలాగే 17 లక్షల లైక్స్‌ దక్కాయి.

ఇక మూడో స్థానంలో పుష్ప పార్ట్ 1 టీజర్ నిలిచింది. ఈ టీజ‌ర్‌.. 2021 ఏప్రిల్ 7న రిలీజ్ చేయగా.. 9 కోట్ల 92 లక్షల 19 వేల వ్యూస్‌.. 21 లక్షల లైక్స్ ద‌క్కాయి. నాలుగో ప్లేస్‌లో ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టార‌ర్ ఆర్‌ఆర్ఆర్ ట్రైలర్ దక్కించుకుంది. రాజమండ్రి సినిమా ట్రైలర్ 2021 డిసెంబర్ 9న రిలీజై.. 8 కోట్ల 66 ల‌క్ష‌ల‌ 25 వేలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. 19 లక్షల లైక్స్ పడ్డాయి. ఇక ఐదవ‌ స్థానంలోను ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ రోల్‌ పరిచయం చేస్తారు రిలీజ్ చేసిన టీజర్ నిలిచింది. 2020 అక్టోబర్ 24 రిలీజ్ అయిన టీజర్ 7 కోట్ల 70 ల‌క్ష‌ల 85 వేలకు పైగా వ్యూస్‌.. 16 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆరవ‌ స్థానంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ నుంచి వస్తున్న ఓజీ మూవీ ట్రైలర్ చేరింది. రిలీజ్ అయిన 3 గంట‌ల్లో 30 లక్షలు వ్యూస్‌, 5 లక్షల లైక్స్ సొంతమయ్యాయి. మరి.. ఈ ట్రైలర్ ముందు ముందు ఇంకా రికార్డ్ లెవెల్ వ్యుస్‌ సాధించే అవకాశం ఉంది. అప్పుడు ట్రైలర్ ఏ స్థానాన్ని దక్కించుకుంటుందో చూడాలి.