‘ ఓజి ‘ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

కేవలం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. పాన్ వరల్డ్ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఓజీ. పవన్ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌లో హైప్‌ మొదలైంది. సెప్టెంబర్ 25న అంటే మరో రెండు రోజుల్లో.. సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ఒక రోజు ముందు సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రీమియర్స్‌కు అన్ని సిద్ధం చేసేసారు మేకర్స్‌. తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ కూడా ఈ సినిమా ప్రీవియర్స్‌కు పర్మిషన్లు ఇచ్చేసింది. ఈ క్రమంలోనే అన్నిచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యి హాట్‌ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఓజీ రికార్డుల వర్షం కురుస్తుంది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు.. సుజిత్ దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కర్ణాటక, ఓవర్సీస్‌లోను ఓపెన్ బుకింగ్స్‌లో ఓజీ సంచలనాలు సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్ లెక్కలు ఒకసారి చూద్దాం.

OG Premieres on Sep 24th: Catch the Most Anticipated Film of the Year

దాదాపు రూ0.250 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ రైట్స్.. రూ. 102కోట్లు, నైజం థియేట్రిక‌ల్ రైట్స్ రూ.55 కోట్లకు అమ్ముడుపోయాయి. అలా.. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ జిఎస్టితో కలిపి.. రూ.157 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కర్ణాటక రైట్స్ రూ.8 కోట్లకు, తమిళ్, కేరళ రైట్స్ రూ.3 కోట్ల బిజినెస్ జరిగింది. నార్త్ అమెరికా రైట్స్ అయితే ఏకంగా 2.9 మిలియన్ డాలర్లు.. అంటే రూ.25.5 కోట్ల రూపాయలకు బిజినెస్‌ జరగడం విశేషం. యుఎస్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమా.. కనీసం 4.5 మిలియన్ డాలర్ల వ‌సూళ్ల‌ను కొల్లగొట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల‌ అంచనా. కర్ణాటకలో ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌తో సెన్సేషన్ సృష్టిస్తుంది. వినాయక థియేటర్‌లో కేవలం ఎనిమిది నిమిషాల్లో అన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. బెంగళూరులో కేజిఎఫ్, దేవర సినిమాల కంటే అధికంగా వసూళ్లను నమోదు చేసుకుంది.

They Call Him OG Fans Have Two Requests for the Makers

ఈ సినిమా ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే కోటి రూపాయలను కొల్లగొట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు రికార్డు లెవెల్లో షోస్ పడనున్నాయి. హిందీ వర్షన్ 250 లొకేషన్లలో.. తెలుగు వర్షన్స్ అయితే ఏకంగా 3000 షోలను ప్రదర్శించనున్నారు టీం. ఇక ఈ వివరాలన్నీ బయటకు వచ్చే సమయానికే.. ఏకంగా 2 మిలియన్ డాలర్ కొల్లగొట్టి ఓజీ సంచలనం సృష్టించింది. అంటే.. సుమారు రూ.20 కోట్ల వసూళ్లు వచ్చేసాయి. ఈ విషయాన్ని ప్రత్యాంగిరా సినిమాస్ అఫీషియల్ గా వెల్లడించారు. సినిమా హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇక.. ఈ సినిమా తెలంగాణలో రూ.10 కోట్లు.. ఇండియాలో రూ.20 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దక్కించుకుంది. అలా.. సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.